PM Modi : ర‌హ‌దారులు అభివృద్దికి సోపానాలు – మోదీ

న‌వ భార‌త నిర్మాణం కోస‌మే నా ప్ర‌య‌త్నం

PM Modi : ర‌హ‌దారులు ప్ర‌గ‌తికి సోపానాలుగా ఉప‌యోగ ప‌డుతాయ‌ని స్ప‌ష్టం చేశారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi). శ‌నివారం ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని జ‌లౌన్ లో బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వేను న‌రేంద్ర మోదీ ప్రారంభించారు.

రూ. 14,850 కోట్లతో 296 కిలోమీట‌ర్ల పొడ‌వైన నాలుగు లేన్ల ర‌హ‌దారిని నిర్మించారు. ఈ భార ర‌హ‌దారి నిర్మాణానికి ఫిబ్ర‌వ‌రి 2020లో ప్ర‌ధాన మంత్రి శంకు స్థాప‌న చేశారు.

కేవ‌లం 28 నెల‌ల లోనే ఈ ఎక్స్ ప్రెస్ వే పూర్త‌యింది. బుందేల్ ఖండ్ ర‌హ‌దారి ప్రారంభవత్సం అనంత‌రం న‌రేంద్ర మోదీ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

అభివృద్దే ధ్యేయంగా త‌మ ప్ర‌భుత్వం ముందుకు వెళుతోంద‌న్నారు. ఎవ‌రు ఎన్ని అడ్డంకులు సృష్టించేందుకు య‌త్నించినా తాము మాత్రం ప్ర‌గ‌తి ప‌థం వైపు ఫోక‌స్ పెట్టామ‌ని చెప్పారు.

అతి త‌క్కువ కాలంలో అద్భుతంగా, నాణ్య‌వంతంగా ఎక్స్ ప్రెస్ వేను నిర్మించార‌ని ప్ర‌శంసించారు న‌రేంద్ర మోదీ. బుందేల్ ఖండ్ జాతీయ ర‌హ‌దారి ఈ ప్రాంత అభివృద్ధికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌గా అభివ‌ర్ణించారు.

కొత్త గుర్తింపును ఇస్తుంద‌న్నారు. పారిశ్రామిక పెట్టుబ‌డుల‌కు మార్గంగా మారుతుంద‌ని, ఇందులో ఎలాంటి సందేహం లేద‌న్నారు.

ఎక్క‌డైతే మౌలిక వ‌స‌తులు, ర‌హ‌దారులు బాగుంటాయో అక్క‌డ ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేసేందుకు వీల‌వుతుంద‌న్నారు స‌భ‌లో పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్.

ఉత్త‌ర ప్ర‌దేశ్ ఎక్స్ ప్రెస్ వేస్ ఇండ‌స్ట్రియ‌ల్ డెవ‌ల‌ప్ మెంట్ అథారిటీ ఆధ్వ‌ర్యంలో దీనిని అనుకున్న దాని ముందే నిర్మించడం జ‌రిగింద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచం భార‌త్ వైపు చూస్తోంద‌న్నారు పీఎం(PM Modi).

Also Read : మోదీకి వ్య‌తిరేకంగా ‘ప‌టేల్’ కుట్ర – సిట్

Leave A Reply

Your Email Id will not be published!