Mohan De Selva : యూఈఏ లోనే ఈసారి ఆసియా క‌ప్

శ్రీ‌లంక క్రికెట్ కంట్రోల్ బోర్డు సెక్ర‌ట‌రీ డిసిల్వా

Mohan De Selva : ద్వీప దేశం శ్రీ‌లంక‌లో ఇంకా సంక్షోభం కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టికే దేశ అధ్య‌క్షుడి ఎన్నిక‌కు సంబంధించి ఇంకా కొలిక్కి రాలేదు.
వారం రోజుల్లో ఎన్నుకుంటార‌ని స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. ఆందోళ‌నకారులు అధ్య‌క్షుడి భ‌వ‌నంలోకి వెళ్లారు.

పీఎం ఇంటికి నిప్పంటించారు. జ‌దీంతో ప్రాణ భ‌యంతో ఆ దేశ అధ్య‌క్షుడు గోట‌బ‌య రాజ‌ప‌క్సే ప‌రార‌య్యాడు. గ‌త్యంత‌రం లేక రిజైన్ చేశాడు.

ఈ త‌రుణంలో క్రికెట్ ను ఎక్కువ‌గా ఆరాధించే లంకేయుల‌కు షాక్ ఇచ్చారు శ్రీ‌లంక క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్య‌ద‌ర్శి మోహ‌న్ డిసిల్వా(Mohan De Selva). శ్రీ‌లంక‌లో రాజకీయ అనిశ్శితి నెలకొంద‌ని, ఈ త‌రుణంలో ఇక్క‌డ ఆసియా క‌ప్ ను నిర్వ‌హించ‌డం క‌ష్టం అవుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదే స‌మ‌యంలో షెడ్యూల్ మార‌కుండా క‌ప్ నిర్వ‌హించాలంటే ఒకే ఒక్క మార్గం ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు మోహ‌న్ డిసిల్వా. శ్రీ‌లంక‌లో కాకుండా యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ లో ఆసియా క‌ప్ ను నిర్వ‌హించాల‌ని యోచిస్తున్న‌ట్లు చెప్పారు.

ఆదివారం మోహ‌న్ డిసిల్వ(Mohan De Selva) మీడియాతో మాట్లాడారు. ఇప్ప‌టికే క్రికెట్ కు స్వ‌ర్గ‌ధామంగా మారింది యూఏఈ. ఇక్కేడే గ‌త ఏడాది క‌రోనా కార‌ణంగా భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ ) ఐపీఎల్ 2021ని నిర్వ‌హంచింది.

ఇప్ప‌టికే యూఏఈలో క్రికెట్ కు రోజు రోజుకు జ‌నాద‌ర‌ణ ఉంటోంది. గ‌తంలో క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఆసియా క‌ప్ నిర్వ‌హ‌ణ మ‌రోసారి వాయిదా ప‌డేందుకు ఆస్కారం లేకుండా చేసేందుకే ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌స్తోంద‌న్నారు డిసిల్వా.

Also Read : మూడో వ‌న్డేలో గెలిచేది ఎవ‌రో

Leave A Reply

Your Email Id will not be published!