Nupur Sharma SC : నూపుర్ శ‌ర్మ‌కు సుప్రీంకోర్టు ఊర‌ట

ఆమె జీవితాన్ని స్వేచ్ఛ‌ను ర‌క్షించాలి

Nupur Sharma SC : మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి దేశంలో తీవ్ర సంచ‌ల‌నానికి కేరాఫ్ గా మారిన భార‌తీయ జ‌న‌తా పార్టీ బ‌హిష్కృత నాయ‌కురాలు నూపుర్ శ‌ర్మ‌కు(Nupur Sharma SC) మంగ‌ళ‌వారం సుప్రీంకోర్టు ఊర‌టనిచ్చింది.

త‌న‌పై వివిధ రాష్ట్రాల‌లో ప‌లు కేసులు న‌మోద‌య్యాయ‌ని, త‌న‌కు ప్రాణ భ‌యం, గండం ఉంద‌ని దీంతో తాను ఎక్క‌డికీ వెళ్ల‌లేనంటూ స‌ర్వోన్న‌త న్యాయస్థానాన్ని ఆశ్ర‌యించింది.

దీనిపై ఇవాళ మ‌రోసారి విచారణ చేప‌ట్టింది కోర్టు. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. అన్ని కేసులు ఒకే అంశానికి సంబంధించిన‌విగా ఉన్నాయి. ఒక వ్య‌క్తి అన్ని కేసుల‌కు సంబంధించి ఎలా హాజ‌రు కాగ‌ల‌ద‌నేది ప్ర‌శ్నార్థం.

ఈ విష‌యంపై పునరాలోచించాలి. ఆమె జీవితాన్ని స్వేచ్ఛ‌ను ర‌క్షించాలంటూ పేర్కొంది ధ‌ర్మాస‌నం. ఇదిలా ఉండ‌గా త‌న‌పై న‌మోదైన 9 ఎఫ్ఐఆర్ ల‌ను క‌ల‌పాల‌ని నూపుర్ శ‌ర్మ చేసిన అభ్య‌ర్థ‌న‌ను సుప్రీంకోర్టు ఆగ‌స్టు 10న విచారించ‌నుంది.

మొత్తం కేసుల‌కు సంబంధించి ఆమెను అరెస్ట్ చేయ‌డం సాధ్యం కాద‌ని స్ప‌ష్టం చేసింది కోర్టు. ఆమెపై ఉన్న ప‌లు ఎఫ్ఐఆర్ ల‌ను ఒక‌టిగా క‌ల‌పాల‌న్న ఆమె అభ్య‌ర్థ‌న‌పై స్పందించాల‌ని వివిధ రాష్ట్రాల‌కు సూచించింది స‌ర్వోన్న‌త న్యాయ స్థానం.

అప్ప‌టి వ‌ర‌కు నూపుర్ శ‌ర్మ‌పై ఎలాంటి కేసులు న‌మోదు చేయ‌వ‌ద్దంటూ దేశంలోని అన్ని రాష్ట్రాల‌ను ఆదేశించింది ధ‌ర్మాస‌నం. ఢిల్లీ, మ‌హారాష్ట్ర‌, తెలంగాణ‌, ప‌శ్చిమ బెంగాల్ , క‌ర్ణాట‌క‌, ఉత్త‌ర ప్ర‌దేశ్ , జ‌మ్మూ కాశ్మీర్ , అస్సాం రాష్ట్రాలు ఆమె కేసుపై స్పందించాల‌ని కోరాయి.

ఇదిలా ఉండ‌గా జూలై 1న సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం చేసిన తీవ్ర వ్యాఖ్య‌లు నూపుర్ శ‌ర్మ‌పై మ‌రింత దాడులు పెరిగేలా చేశాయ‌ని ఆమె త‌ర‌పు న్యాయ‌వాది కోర్టుకు విన్న‌వించారు. ఆజ్మీర్ ద‌ర్గా ఉద్యోగి త‌న గొంతు కోస్తాన‌ని వీడియోలో బెదిరించిన విష‌యాన్ని తెలిపారు.

Also Read : మైనింగ్ మాఫియా డీఎస్పీ మృతిపై కాంగ్రెస్ సీరియస్

Leave A Reply

Your Email Id will not be published!