Graeme Smith : ‘సీఎస్ఏ’ కమిషనర్ గా గ్రేమీ స్మిత్
సఫారీ క్రికెటర్ కు అరుదైన గౌరవం
Graeme Smith : దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ కు అరుదైన గౌరవం లభించింది. తమ దేశంలో కొత్తగా నిర్వహించ బోయే క్రికెట్ సౌతాఫ్రికా టి20 లీగ్ కు కమిషనర్ గా నియమించారు. ఇందులో ఆరు టీమ్ లు ఉన్నాయి. ఈ జట్లను ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడం విశేషం.
కేప్ టౌన్ , జోహెన్నస్ బర్గ్ , డర్బన్ , పోర్డ్ ఎలిజబెత్, ప్రిటోరియా, పార్ల్ పేర్లతో ఉన్న ఫ్రాంచైజీలను భారత్ కు చెందిన ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ , లక్నో సూపర్ జెయింట్స్ , సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ , ఢిల్లీ క్యాపిటల్స్ , రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేశాయి.
కొత్తగా నిర్వహించే టి20 లీగ్ కు గ్రేమీ స్మిత్(Graeme Smith) కు ప్రధాన బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే క్రికెట్ పరంగా గ్రేమీ స్మిత్ కు అపారమైన అనుభవం ఉంది. దీంతో లీగ్ బాధ్యతలు ఆయనకు ఇస్తేనే బావుంటుందని నమ్మారు.
ఇప్పటికే గ్రేమీ స్మిత్ ఆటగాడిగా, సారథిగా, కామెంటేటర్ గా, అంబాసిడర్ గా, కన్సల్టెంట్ గా ఎన్నో పదవులు నిర్వహించాడు. వాటికి అరుదైన గౌరవాన్ని తీసుకు వచ్చేలా చేశాడు.
సౌతాఫ్రికాలో క్రికెట్ ను మరింత బలంగా తయారు చేయడం, కొత్త ఆటగాళ్లను వెలుగులోకి తీసుకు రావాలనే ఉద్దేశంతో టి20 లీగ్ చేపట్టినట్లు సీఎస్ఏ వెల్లడించింది.
తనను కమిషనర్ గా ఎంపిక చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు గ్రేమీ స్మిత్. ఈ దేశంలో ఎంతో మంది ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉన్నారు. వారందరి కలలను సాకారం చేసేందుకు వీలు కలుగుతుందన్నాడు.
Also Read : రాజీనామా చేయనున్న రాజీవ్ శుక్లా..?