CJI NV Ramana : అవ‌గాహ‌న లేని చ‌ర్చ‌లు హానిక‌రం – సీజేఐ

ఎన్వీ ర‌మ‌ణ సంచ‌ల‌న కామెంట్స్

CJI NV Ramana : భార‌త దేశ సర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అవ‌గాహ‌న లేని చ‌ర్చ‌ల వ‌ల్ల ప్ర‌జాస్వామ్యం మ‌నుగ‌డ సాధించ లేద‌న్నారు.

జార్ఖండ్ లోని రాంచీలో శ‌నివారం ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఎన్వీ ర‌మ‌ణ ప్ర‌సంగించారు. న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌క పోవ‌డం, మౌలిక స‌దుపాయాల‌ను మెరుగు ప‌ర్చ‌క పోవ‌డం వ‌ల్ల‌నే దేశంలో అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

న్యాయ‌మూర్తుల జీవితాల‌పై త‌ప్పుడు క‌థ‌నాల‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌(CJI NV Ramana). రాంచీ లోని నేష‌న‌ల్ యూనివ‌ర్శిటీ ఆఫ్ స్ట‌డీ , రీసెర్చ్ ఇన్ లా ఆధ్వ‌ర్యంలో న్యాయూమ‌ర్తి జీవితంపై ప్ర‌త్యేకంగా స‌మావేశం ఏర్పాటు చేశారు.

న్యాయ‌మూర్తులు వారి పూర్తి సామ‌ర్థ్యానికి అనుగుణంగా ప‌ని చేసేందుకు భౌతికంగా, వ్య‌క్తిగ‌తంగా మౌలిక స‌దుపాయాల‌ను పున‌రుద్ద‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.

ప్ర‌స్తుత న్యాయ వ్య‌వ‌స్థ ముందున్న అతి పెద్ద స‌వాళ్ల‌లో ఒక‌టి తీర్పు కోసం అంశాల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌డ‌మేన‌ని పేర్కొన్నారు. న్యాయ‌మూర్తులు సామాజిక వాస్త‌వాల ప‌ట్ల క‌ళ్లు మూసుకోలేరు.

వ్య‌వ‌స్థ‌ను త‌ప్పించు కోద‌గిన సంఘ‌ర్ష‌ణ‌లు, భారాల నుండి ర‌క్షించేందుకు విష‌యాల‌ను నొక్కి చెప్పేందుకు ప్రాధాన్య‌త ఇవ్వాలన్నారు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌(CJI NV Ramana).

ఆధునిక ప్ర‌జాస్వామ్యంలో న్యాయమూర్తిని కేవ‌లం చ‌ట్టాన్ని చెప్పే వ్య‌క్తిగా నిర్వ‌చించ లేమ‌న్నారు. మీడియాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌. ఎల‌క్ట్రానిక్ మీడియాకు జ‌వాబుదారీత‌నం లేకుండా పోయింద‌న్నారు.

అనుభ‌వం క‌లిగిన జ‌డ్జీలు కూడా ఒక్కోసారి ఇబ్బందికి గురి కావాల్సి వ‌స్తుంద‌న్నారు.

Also Read : యూపీ స‌ర్కార్ పై వ‌రుణ్ గాంధీ ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!