Amit Shah : రాబోయే ఎన్నికల్లో మోదీనే ప్రధాని అభ్యర్థి
స్పష్టం చేసిన కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా
Amit Shah : ట్రబుల్ షూటర్ గా పేరొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah) షాకింగ్ కామెంట్స్ చేశారు. రాబోయే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవి అభ్యర్థి ఎవరనే దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
బీజేపీ ఈ మధ్యన కీలక నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే ఒకరికి ఒక పదవి మాత్రమే ఉండాలని, జోడు పదవులు ఉండ కూడదని అది అందరికీ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
మరో వైపు వయస్సు విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో భారత దేశానికి రెండోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైన నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఉంటారా ఉండరా అన్న అనుమానం ఆ పార్టీలోనే కాదు విపక్షాలలోనూ ఉత్కంఠ నెలకొంది.
దీనిని పటాపంచలు చేశారు అమిత్ షా. బీహార్ లోని పాట్నాలో పర్యటించిన అమిత్ షా కీలక ప్రకటన చేశారు. అదేమిటంటే మోదీనే తమ నాయకుడని, రాబోయే ఎన్నికల్లో సైతం అతనే పార్టీ తరపున ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఉంటారని స్పష్టం చేశారు.
ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ లీడర్ గా పేరొందిన మోదీని మరోసారి ప్రధానిగా చూడాలని దేశం కోరుకుంటోందని స్పష్టం చేశారు అమిత్ చంద్ర షా(Amit Shah).
మోదీ సారథ్యంలోనే బీజేపీ ఎన్నికలకు వెళుతుందన్నారు. అంతే కాకుండా బీజేపీ – జేడీయూ పొత్తు కొనసాగుతుందని అన్నారు. 2024 ఎన్నికలతో పాటు 2025లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కలిసే పోటీ చేస్తాయని కుండ బద్దలు కొట్టారు.
Also Read : కొనసాగుతున్నఎంపీల నిరసనల పర్వం