Zabihullah Mujahid : అల్ జవహరి హతం తాలిబన్ ఆగ్రహం
ఖండించిన జబీహుల్లా ముజాహిద్
Zabihullah Mujahid : ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ లో తన కుటుంబంతో తలదాచుకున్న అల్ ఖైదా చీఫ్ అల్ – జవహరిని అమెరికా వైమానిక దళం సీక్రెట్ ఆపరేషన్ లో మట్టుబెట్టింది.
2001లో అమెరికాలో జరిగిన రాకెట్ దాడి ఘటనలో బిన్ లాడెన్ తో పాటు అయాన్ అల్ జవహరిని ఖతం చేసింది. అల్ ఖైదా చీఫ్ ను తమ దళాలు సీక్రెట్ ఆపరేషన్ ద్వారా హతమార్చినట్లు ప్రకటించారు అమెరికా దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్.
ఇదిలా ఉండగా అల్ ఖైదా చీఫ్ ను మట్టుబెట్టడంపై తాలిజన్లు నిప్పులు చెరిగారు. ఈ దాడిని ఖండించారు తాలిబాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్(Zabihullah Mujahid).
ఈ విషయాన్ని ఆయన మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ ఘటన జరగడం బాధాకరమని, అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంఘించడమేనని ఆరోపించారు.
తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ ఘటన ఆదివారం జరిగిందని తెలిపారు. కాబూల్ లోని నివాసంపై డ్రోన్ దాడి చేసిందంటూ వెల్లడించారు.
యుఎస్ దళాల ఉపసంహరణపై 2020 ఒప్పందాన్ని పరిగణలోకి తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు జబీహుల్లా ముజాహిద్. 9/11 అమెరికాలో ఉగ్రదాడి ఘటనలో అల్ ఖైదా చీఫ్ బిన్ లాడెన్ తో పాటు అల్ జవహరి కీలక పాత్ర పోషించాడు.
ఆనాటి నుంచి అగ్రరాజ్యం ఆగ్రహంతో ఉంది. ఈ ఘటన 2001లో చోటు చేసుకుంది. 21 ఏళ్ల తర్వాత జవహరిని మట్టుబెట్టింది.
ఆఫ్గనిస్తాన్ పై అమెరికా పట్టు కలిగినా చివరకు తాలిబన్ల చేతిలో పరాభవం జో బైడెన్ ను ఇబ్బంది పెట్టింది. తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.
Also Read : అల్ ఖైదా చీఫ్ అల్-జవహరి ఖతం