Al Qaeda Chief : అల్ జవహరిపై ఆయుధాలు ప్రయోగించిందా
అనుమానం వ్యక్తం చేస్తున్న తాలిబన్లు
Al Qaeda Chief : వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా పేరొందిన 71 ఏళ్ల అల్ ఖైదా చీఫ్ అయాన్ అల్ జవహరి ని ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్ లో హత మార్చింది. ఈ విషయాన్ని అమెరికా చీఫ్ జోసెఫ్ బైడెన్ అధికారికంగా ప్రకటించారు.
యుఎస్ వైమానిక దాడులలో హతమార్చినట్లు తెలిపారు. కానీ డ్రోన్లతో దాడి చేశామని అమెరికా అంటోంది. కానీ అత్యంత పటిష్టవంతమైన నెట్ వర్క్ కలిగి ఉంది అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ.
ఎక్కడైనా ఎప్పుడైనా దాడులు చేసేందుకు బలమైన బలగం ఉంది ఈ టెర్రరరిస్ట్ గ్రూప్ క్. దీని వెనుక నుంచి నడిపిస్తూ ముందుకు సాగుతున్న ఏకైక వ్యక్తి అల్ జవహరి.
అమెరికాపై టవర్ పై రాకెట్ దాడి తర్వాత ఒక్కసారిగా భయాందోళనకు గురైంది అగ్రరాజ్యం. అల్ ఖైదా చీఫ్ బిన్ లాడెన్(Al Qaeda Chief) తో పాటు అయాన్ అల్ జవహరి కీలక పాత్ర పోషించినట్లు గుర్తించింది.
2001 తర్వాత 21 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అల్ జవహరిని ఖతం చేసింది. అల్ ఖైదా చీఫ్ ను మట్టుబెట్టిన ఘటనలో అమెరికా 2 క్షిపణులు ప్రయోగించినట్లు అనుమానం వ్యక్తం అవుతోంది.
ఇందుకు సంబంధించి ఇంకా ఆధారాలు లభ్యం కాలేదు. హెల్ ఫైర్ ఆర్9ఎక్స్ ను వాడినట్లు తాలిబన్ అంటోంది. తీవ్రవాద నాయకులను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేయడంలో ఆరితేరింది అమెరికా.
2017 నుంచి ఇలాంటి దాడులను మరింత ముమ్మరం చేసింది. అయితే అల్ జవహరిని హతమార్చిన ఘటనలో సాధారణ పౌరులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదంటూ స్పష్టం చేశారు అమెరికా దేశాధ్యక్షుడు జో బైడెన్.
Also Read : అన్యాయంపై న్యాయం గెలిచింది – బైడెన్