Punjab CM : యావత్ భారతం హర్జిందర్ సింగ్ ను చూసి పొంగి పోతోంది. నువ్వు సాధించింది కాంస్య పతకమే కావచ్చు. కానీ ఆ పతకాన్ని అందుకునేందుకు నువ్వు పడిన శ్రమ ఎంతో గొప్పది.
ఈ దేశానికే కాదు పంజాబ్ రాష్ట్రంలోని యువతకు నువ్వు ఆదర్శ ప్రాయంగా , స్పూర్తి దాయకంగా ఉంటావని కొనియాడారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్(Punjab CM) .
వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో అద్భుతమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శించింది ఈ మహిళా వెయిట్ లిఫ్టర్. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ కీలక పోటీలో కౌర్ చివరి దాకా పోరాడింది.
కానీ కొద్ది పాటి తేడాతో రజత (సిల్వర్) పతకాన్ని కోల్పోయింది. హర్జిందర్ సింగ్ స్వస్థలం పంజాబ్ రాష్ట్రంలోని సభా సమీపంలోని మెహ్స్ గ్రామం. బ్రిటన్ లోని బర్మింగ్ హోమ్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ -2022 జరుగుతున్నాయి.
వెయిట్ లిఫ్టింగ్ విభాగం నుంచి భారత దేశం నుంచి ప్రాతినిధ్యం వహించింది హర్జిందర్ కౌర్. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి భారత్ కు చెందిన అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శన చేపట్టారు.
ఇప్పటి వరకు 9 పతకాలు సాధించారు. ఇందులో 3 స్వర్ణాలు 3 రజతాలు 3 కాంస్య పతకాలు ఉన్నాయి. ఈ సాధించిన పతకాలలో హర్జిందర్ సింగ్ సాధించిన కాంస్య పతకం కూడా ఒకటి కావడం విశేషం.
ఈ సందర్భంగా కాంస్య పతక విజేత అయిన ఆమెను ప్రత్యేకంగా ట్విట్టర్ వేదికగా అభినందించారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్(Punjab CM). ఆయనతో పాటు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా అభినందించారు.
Also Read : కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ భళా
ਰਾਸ਼ਟਰਮੰਡਲ ਖੇਡਾਂ ਵਿੱਚ ਨਾਭਾ ਨੇੜਲੇ ਪਿੰਡ ਮੈਹਸ ਦੀ ਜੰਮਪਲ ਹਰਜਿੰਦਰ ਕੌਰ ਵੱਲੋਂ ਵੇਟ ਲਿਫਟਿੰਗ ‘ਚ ਕਾਂਸੀ ਦਾ ਤਮਗਾ ਜਿੱਤਣ ‘ਤੇ ਵਧਾਈਆਂ…
ਹਰਜਿੰਦਰ ਤੁਸੀਂ ਪੰਜਾਬ ਦੀਆਂ ਬੱਚੀਆਂ ਲਈ ਪ੍ਰੇਰਣਾਸਰੋਤ ਬਣੋਗੇ…ਤੁਹਾਡੇ ਮਾਪੇ ਅਤੇ ਕੋਚ ਸਾਹਿਬਾਨ ਨੂੰ ਵੀ ਵਧਾਈਆਂ…ਚੰਗੇ ਭਵਿੱਖ ਲਈ ਸ਼ੁਭਕਾਮਨਾਵਾਂ…
ਚੱਕਦੇ ਇੰਡੀਆ…. pic.twitter.com/qtn3lkgHJ5
— Bhagwant Mann (@BhagwantMann) August 2, 2022