Barack Obama : అల్ ఖైదా చీఫ్ హ‌త్య స‌బ‌బే – ఒబామా

యుద్ధం చేయ‌కుండానే ఉగ్ర‌వాదంపై పోరు సాధ్య‌మే

Barack Obama : ప్ర‌పంచ ఉగ్ర‌వాద సంస్థ అల్ ఖైదా చీఫ్ గా ఉన్న అయాన్ అల్ జ‌వ‌హిరి ని మ‌ట్టు బెట్టింది అమెరికా. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప్ర‌క‌టించారు అమెరికా దేశ అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్.

21 ఏళ్ల స‌మ‌యం ప‌ట్టింది ఈ క‌ర‌డు బెట్టిన ఉగ్ర‌వాదిని మ‌ట్టుబెట్టేందుకు. ఈ సంద‌ర్భంగా ప్ర‌పంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హ‌ర్షం వ్య‌క్తం చేస్తుండ‌గా తాలిబ‌న్ల‌తో పాటు ముస్లిం దేశాలు మండి ప‌డుతున్నాయి.

ఆఫ్గ‌నిస్తాన్ రాజ‌ధాని కాబూల్ లో ఓ ఇంట్లో త‌ల‌దాచుకున్న అల్ జ‌వ‌హిరి కుటుంబాన్ని ఖ‌తం చేసింది. ఈ విష‌యాన్ని అత్యంత గోప్యంగా ఉంచుతూ వ‌చ్చారు. ఉన్న‌ట్టుండి జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు బైడెన్.

2001లో అమెరికాపై రాకెట్ దాడికి పాల్ప‌డింది అల్ ఖైదా. దీని వెనుక బిన్ లాడెన్ తో పాటు అల్ జ‌వ‌హిరి కీల‌క పాత్ర పోషించిన‌ట్లు గుర్తించింది.

ఆనాటి నుంచి నేటి దాకా వెంటాడుతూనే ఉంది అమెరికా. 2011లో పాకిస్తాన్ లో బిన్ లాడెన్ ను హ‌తం చేసింది. అంటే అత‌డిని చంపేందుకు 10 ఏళ్లు ప‌ట్టింది.

అనంత‌రం 21 ఏళ్ల స‌మ‌యం ప‌ట్టింది జ‌వ‌హిరిని ఖ‌తం చేసేందుకు. చాలా సార్లు ట్రై చేసింది అమెరికా ఆర్మీ. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. ఈసారి గురి త‌ప్ప‌లేదు.

అల్ ఖైదా చీఫ్ ను చంపేదాకా నిద్ర పోలేదు యుఎస్. ఈ సంద‌ర్భంగా ఈ ఘ‌ట‌న‌పై స్పందించారు అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా(Barack Obama).

ఆఫ్గ‌నిస్తాన్ లో యుద్దం చేయ‌కుండానే ఉగ్ర‌వాదంపై పోరు సాధ్య‌మ‌ని ఈ హత్య నిరూపించింద‌ని పేర్కొన్నారు.

ఇది బైడ‌న్ నాయ‌క‌త్వానికి, ఈ క్ష‌ణం కోసం దశాబ్దాలుగా ప‌ని చేస్తున్న ఇంటెలిజెన్స్ క‌మ్యూనిటీ స‌భ్యుల‌కు , ప్రాణ న‌ష్టం లేకుండా క్లోజ్ చేసినందుకు అభినంద‌న‌లు తెలిపారు.

Also Read : అన్యాయంపై న్యాయం గెలిచింది – బైడెన్

Leave A Reply

Your Email Id will not be published!