ED Raids : నేష‌న‌ల్ హెరాల్డ్..ఏజీఎల్ ఆఫీసుల్లో ఈడీ సోదాలు

ఇప్ప‌టికే రాహుల్..సోనియా విచార‌ణ

ED Raids : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో మ‌రో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. కోట్లాది రూపాయ‌లు చేతులు మారాయని, మ‌నీ లాండ‌రింగ్ చోటు చేసుకుందంటూ భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన మాజీ ఎంపీ, ప్ర‌ముఖ న్యాయ‌వాది సుబ్ర‌మ‌ణ్య స్వామి ఫిర్యాదు చేశారు.

ఈ మేర‌కు ఆధారాలు స‌మ‌ర్పించారు సీబీఐకి. ఈ మేర‌కు న‌మోదు చేసిన కేసు ఆధారంగా అప్ప‌టి దాకా కొట్టేసిన కేసును తిరిగి తెరిచింది కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ).

ఇందులో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీల‌కు సంబంధం ఉందంటూ స‌మ‌న్లు జారీ చేసింది. కోవిడ్ కార‌ణంగా ఆల‌స్యంగా విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు ఈడీ ముందుకు సోనియా గాంధీ.

అంత‌కు ముందు రాహుల్ గాంధీని అయిదు రోజుల పాటు విచారించింది కేంద్ర దర్యాప్తు సంస్థ‌. మూడు రోజుల పాటు సోనియాను ప్ర‌శ్నించింది.

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర స‌ర్కార్ పై నిప్పులు చెరిగింది. ఇదే స‌మ‌యంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీల‌ను విచారించిన స‌మ‌యంలో వారు చెప్పిన వివ‌రాల మేర‌కు మంగ‌ళ‌వారం ఈడీ(ED Raids)  రంగంలోకి దిగింది.

నేష‌న‌ల్ హెరాల్డ్ ఆఫీసుతో పాటు దానిని నిర్వ‌హిస్తున్న అసోసియేటెడ్ జ‌ర్న‌ల్స్ లిమిటెడ్ (ఏజేఎల్ ) కార్యాల‌యంలో కూడా సోదాలు జ‌రుపుతోంది.

ఇదిలా ఉండ‌గా ఆయా సంస్థ‌ల‌కు సంబంధించిన ఆస్తుల‌ను ప్రోబ్ ఏజెన్సీ అటాచ చేసే అవకాశం ఉంద‌ని స‌మాచారం. మొత్తం ఈ కేసుకు సంబంధించి ఇవాళ 12 చోట్ల సోదాలు జ‌రుపుతోంది ఈడీ.

Also Read : రాబోయే ఎన్నిక‌ల్లో మోదీనే ప్ర‌ధాని అభ్య‌ర్థి

Leave A Reply

Your Email Id will not be published!