PM Modi : దేశ నిర్మాణం కోసం దేశ‌భ‌క్తి అవ‌స‌రం

పిలుపునిచ్చిన ప్ర‌ధాన మంత్రి మోదీ

PM Modi :  75 ఏళ్ల స్వ‌తంత్ర భార‌త దేశం ప్ర‌పంచానికి ఆద‌ర్శ ప్రాయంగా నిలిచింద‌న్నారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ స్థాప‌న‌కు ఇది సువ‌ర్ణ అవ‌కాశ‌మ‌ని అన్నారు.

ఈ దేశాన్ని ఏక్ భార‌త్ శ్రేష్ట్ భార‌త్ గా ప్ర‌మోట్ చేసేందుకు జాతీయ ఐక్య‌త త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు న‌రేంద్ర మోదీ. దేశానికి శ్రేయ‌స్సును అందింత‌చే తిరంగ ఐక్య‌త‌కు ప్ర‌తీక అని అన్నారు.

ఆనాడు దేశం కోసం , దేశ విముక్తి కోసం క‌న‌బ‌ర్చిన దేశ భ‌క్తి ప్ర‌స్తుత త‌రంలో పెంపొందించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. దేశ నిర్మాణం కోసం మ‌ళ్లించాల‌ని ప్ర‌ధాన మంత్రి(PM Modi) పిలుపునిచ్చారు.

ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ పై మూడో జాతీయ క‌మిటీ స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. దేశంలో దేశ‌భ‌క్తి ప్రాధాన్య‌త ఏమిటో చెప్పాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌న్నారు.

ఆనాడు పోరాట స‌మ‌యంలో చూపించిన దేశ భ‌క్తి అపూర్వ‌మైన‌ద‌ని కొనియాడారు. అదే ఉత్సాహాన్ని, నిబ‌ద్ద‌త‌ను ప్ర‌స్తుత త‌రంలో నింపాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

దానిని దేశ నిర్మాణానికి అందించాల‌ని పిలుపునిచ్చారు. దేశంలో కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్న‌ది యువ‌తేన‌ని, వారు త‌ప్ప‌నిసరిగా దేశ నిర్మాణంలో పాల్గొనేలా ఉద్యుక్తుల‌ను, కార్యోన్ముఖుల‌ను చేయాల‌ని స్ప‌ష్టం చేశారు.

కేంద్ర స‌ర్కార్ చేప‌ట్టిన ఈ మ‌హోత్స‌వం ఒక పండుగ‌లా జ‌ర‌పాల‌ని కోరారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi). ప్ర‌స్తుత త‌రం రేప‌టి నాయ‌క‌త్వానికి బాధ్య‌త వ‌హిస్తుంది. ఇలాంటి స‌మ‌యంలో దేశ భ‌విష్య‌త్తు వారిపై ఆధార‌ప‌డి ఉంద‌న్నారు మోదీ.

Also Read : భార‌త్ ను విశ్వ గురువుగా చేయాలి

Leave A Reply

Your Email Id will not be published!