IND vs WI 4th T20 : విండీస్ పై భారత్ గ్రాండ్ విక్టరీ
59 పరుగుల తేడాతో ఘన విజయం
IND vs WI 4th T20 : విండీస్ టూర్ లో ఇప్పటికే వన్డే సీరీస్ చేజిక్కించుకున్న భారత జట్టు టి20 సీరీస్ కూడా కైవసం చేసుకుంది. 5 టి20 మ్యాచ్ ల సీరీస్ లో ఇప్పటి వరకు 3-1 ఆధిక్యంలో కొనసాగుతోంది.
తాజాగా జరిగిన 4వ టి20 మ్యాచ్(IND vs WI 4th T20) లో 59 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 192 పరుగుల టార్గెట్ ముందుంచింది ఆతిథ్య జట్టుకు.
అనంతరం బరిలోకి దిగిన విండీస్ 132 పరుగుల స్వల్ప స్కోర్ కే చాప చుట్టేసింది. అంతకు ముందు రిషబ్ పంత్ 44 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ భారత్ కు శుభారంభం అందించాడు.
రోహిత్ శర్మ 16 బంతులు ఆడి 33 రన్స్ చేశాడు. సూర్య కుమార్ యాదవ్ 14 బంతులు ఆడి 24 రన్స్ చేశాడు. అక్షర్ పటేల్ 8 బంతులు ఆడి 20 పరుగులు చేశాడు. ఇక సంజూ శాంసన్ 30 పరుగులు చేశాడు.
దినేష్ కార్తీక్ నిరాశ పరిచాడు. కేవలం ఆరు రన్స్ మాత్రమే చేశాడు. ఇక ఇండియా తరపు నుంచి రోహిత్ శర్మ, పంత్ , సంజూ శాంసన్ , సూర్య కుమార్ యాదవ్ , దీపక్ హూడా, దినేష్ కార్తీక్ , అక్షర్ పటేల్ , భువనేశ్వర్ కుమార్ , బిష్ణోయ్ , ఆవేష్ ఖాన్ , అర్ష దీప్ సింగ్ ఆడారు.
ఇక విండీస్ తరపున కే మేయర్స్ , బి కింగ్ , హెట్మెయిర్ , నికోలస్ పూరన్ , ఆర్ పావెల్ , డి థామస్ , జేసన్ హోల్డర్ , హొసియన్ , డ్రాకేస్, మెకాయ్ , జోసెఫ్ ఆడారు.
Also Read : పురుషుల హాకీ ఫైనల్ కు భారత్