Bhavina Ben Patel : పారా టేబుల్ టెన్నిస్ లో ‘భవినా’కు స్వర్ణం
కామన్వెల్త్ గేమ్స్ లో రెజ్లింగ్ లో 3 బంగారు పతకాలు
Bhavina Ben Patel : బర్మింగ్ హోమ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ పతకాల పంట పండుతోంది. 9వ రోజులో నాలుగు స్వర్ణాలు దక్కాయి. ఇప్పటి వరకు మొత్తంగా చూస్తే పతకాల పట్టికలో భారత్ 12 స్వర్ణాలు, 11 రజతాలు, 13 కాంస్య పతకాలు సాధించింది.
మొత్తం 36 పతకాలతో దుమ్ము రేపింది. రెజ్లింగ్ లో 3 స్వర్ణాలు దక్కాయి. ఇక పారా టేబుల్ టెన్నిస్ లో భవినా బెన్(Bhavina Ben Patel) స్వర్ణం దక్కించుకుంది. మహిళల 53 కేజీల విభాగంలో వినేష్ ఫోగట్ కు స్వర్ణం లభించింది.
రవి దహియా 57 కేజీల ఫైనల్ లో బంగారు పతకాన్ని సాధించాడు. పురుషుల 74 కేజీల ఫైనల్లో నవీన్ పాకిస్తాన్ కకు చెందిన మహ్మద్ షరీఫ్ తాహిరత్ పై విజయం సాధించాడు. దీంతో మరో స్వర్ణం దక్కింది.
ఇక పూజా గెహ్లాట్ మహిళల 50 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించింది. రెజ్లింగ్ లో మరో రెండు కాంస్య పతకాలు దక్కాయి. పూజా సిహాగ్ మహిళల 76 కేజీల విభాగంలో ఆసిస్ కు చెందిన నవోమి వడి బ్రూయిన్ ను ఓడించింది.
పురుషుల 97 కిలోల విభాగంలో దీపక్ నెహ్రా పాకిస్తాన్ కు చెందిన తయాబ్ రజాపై గెలుపొందారు. భారత పురుషుల హాకీ జట్టుతో పాటు మహిళల
క్రికెట్ జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. సాగర్ అహ్లావత్ , నిఖత్ జరీన్ , అమిత్ పంఘల్ , నీతూ గంగాస్ అర్హత సాధించారు. .
ప్రియాంక గోస్వామి రజత పతకాన్ని సాధించింది. అవినాష్ సాబుల్ రజతం గెలుపొందాడు. పారా టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ లో
సోనా ల్ బెన్ పటేల్ 3-5 తో కాంస్య పతకాన్ని సాధించింది.
లాన్ బౌల్స్ లో భారత్ రజతం సాధించింది. బ్యాడ్మింటన్ లో పీవీ సింధు సెమీస్ కు ప్రవేశించింది. పురుషుల సింగిల్స్ లో శ్రీకాంత్ , లక్ష్యసేన్ కూడా సెమీస్ కు చేరుకున్నారు.
Also Read : పురుషుల హాకీ ఫైనల్ కు భారత్