Varsha Raut ED : 9 గంటల పాటు వర్షా రౌత్ విచారణ
మళ్లీ తనకు సమన్లు పంపలేదు
Varsha Raut ED : జైలులో ఉన్న శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్ ను ఈడీ విచారించింది. ఈడీ జారీ చేసిన సమన్ల మేరకు వర్షా రౌత్ ఈడీ కార్యాలయానికి చేరుకుంది.
ఉదయం 10. 40 గంటల నుండి 9 గంటలకు పైగా విచారించింది ఈడీ. వర్షా రౌత్(Varsha Raut ED) వెంట కుమారుడు, కూతురు ఉన్నారు. వారితో పాటు సోదరుడు సునీల్ రౌత్ కూడా హాజరయ్యారు.
అయితే వీరిని ఎవరినీ ఈడీ అనుమతించ లేదు. వర్షా రౌత్ ఒక్కరినే విచారణ చేపట్టింది. పాత్రా చాల్ రీ డెవలప్ మెంట్ స్కామ్ కు సంబంధించి తన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసి వెళ్లి పోయారు.
ఈ సందర్భంగా ఈడీ విచారణ పూర్తయిన అనంతరం సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అడిగిన ప్రశ్నలన్నింటికీ తాను పూర్తిగా సమాధానం ఇచ్చానని చెప్పారు.
అయితే ఎన్నికేసులు బనాయించినా, వేధింపులకు గురి చేసినా తాను , తన భర్త సంజయ్ రౌత్ శివసేన పార్టీని విడిచి పెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఏది జరిగినా ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.
శివసేన పార్టీ చీఫ్, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేకు బేషరతుగా మద్దతు ఇస్తామని చెప్పారు వర్షా రౌత్. సబర్బన్ గోరేగావ్ లోని పాత వరుస టెన్ మెంట్ అయిన పత్రా చాల్ ను పునరాభివృద్ది చేయడంలో అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపించింది.
ఇందులో మనీ లాండరింగ్ చోటు చేసుకుందని కేసు నమోదు చేసింది. ఇందుకు సంబంధించి ఈడీ విచారణకు పిలిపించింది వర్షా రౌత్ ను. ఈ వారం ప్రారంభంలో ఈడీ సమన్లు జారీ చేసింది.
Also Read : బీజేపీకి మద్దతు ఇవ్వడంపై ‘అల్వా’ ఫైర్