Nitish Kumar Modi : జేడీయూ బీజేపీ మ‌ధ్య పెరిగిన దూరం

దూకుడు పెంచిన నితీష్ కుమార్

Nitish Kumar & Modi : బీహార్ లో నితీష్ కుమార్ సార‌థ్యంలో సంకీర్ణ ప్ర‌భుత్వం కొలువు తీరింది. ఇందులో భార‌తీయ జ‌న‌తా పార్టీ కీల‌క పాత్ర పోషిస్తోంది. ఆయ‌న పీఎం(Nitish Kumar & Modi)  విందు భోజ‌నానికి హాజ‌రు కాలేదు.

ఆపై అనారోగ్యం పేరుతో నీతి ఆయోగ్ స‌మావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో ఆగ‌స్టు 9న మంగ‌ళ‌వారం జేడీయూకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీల‌తో నితీశ్ కుమార్ స‌మావేశానికి పిలుపునిచ్చారు.

బీజేపీతో క‌లిసి ప్ర‌స్తుతం బీహార్ లో ప్ర‌భుత్వం కొలువు తీరింది. రోజు రోజుకు బీజేపీకి జేడీయూకు మ‌ధ్య దూరం పెరుగుతుంద‌ని అనిపిస్తోంది సీఎం తీరు చూస్తుంది.

ఇదిలా ఉండ‌గా ఇదంతా ఒట్టి ప్ర‌చార‌మేన‌ని, అందులో ఎలాంటి వాస్త‌వం లేదని కుండ బ‌ద్ద‌లు కొట్టారు కేంద్ర మంత్రి అమిత్ షా. పాట్నాలో ప‌ర్య‌టించిన ఆయ‌న జేడీయూ, బీజేపీ మ‌ధ్య ఎలాంటి పొర‌పొచ్చాలు లేవ‌ని త‌మ బంధం కొన‌సాగుతుంద‌ని చెప్పారు.

ఆపై వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా క‌లిసే పోటీ చేస్తాంమ‌ని క్లారిటీ ఇచ్చారు. కానీ సీన్ మాత్రం వేరేగా ఉంది. నితీష్ కుమార్ బీజేపీపై దాడి మొద‌లు పెట్టారు.

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కార్ మిత్ర‌ప‌క్షాల‌కు కేంద్ర మంత్రులుగా చాన్స్ ఇవ్వ‌క పోవ‌డంపై ఆగ్ర‌హంగా ఉన్నారు ప్ర‌స్తుత బీహార్ సీఎం. ఆర్సీపీ సింగ్ కు గ‌త నెల‌లో రాజ్య‌స‌భ బెర్త్ ను ఇచ్చేందుకు నిరాక‌రించారు నితీష్ కుమార్(Nitish Kumar).

ఆయ‌న జేడీయూకు వీడ్కోలు ప‌లికారు. త‌న‌పై కుట్ర జ‌రిగిందంటూ ఆరోపించ‌డం క‌ల‌క‌లం రేపింది. జేడీయూని మునిగి పోతున్న ఓడ‌గా అభివ‌ర్ణించాడు. మొత్తంగా రేప‌టి స‌మావేశంలో ఏం చేయ‌బోతున్నార‌నేది ప్ర‌శ్నార్థకంగా మారింది.

Also Read : దాసోజు శ్ర‌వ‌ణ్ బీజేపీలోకి జంప్

Leave A Reply

Your Email Id will not be published!