PM Modi : వ్య‌వ‌సాయం ఆధునీక‌ర‌ణ అవ‌స‌రం – మోదీ

నీతి ఆయోగ్ లో ప్ర‌ధాన మంత్రి

PM Modi : ప్ర‌స్తుతం దేశాన్ని ప్ర‌భావితం చేస్తున్న వాణిజ్యం..ప‌ర్యాట‌కం..సాంకేతిక‌త‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెడుతున్నామ‌ని అన్నారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. క‌రోనాపై పోరాటంలో స‌హకార స‌మాఖ్య స్ఫూర్తితో చేసిన రాష్ట్రాల ప్ర‌య‌త్నాన్ని ప్ర‌శంసించారు.

దేశం స్వయం స‌మృద్ధిని సాధించేందుకు, వ్య‌వ‌సాయంలో ప్ర‌పంచ అగ్ర‌గామిగా నిలిచేందుకు మ‌రింత క‌ష్ట ప‌డాల‌న్నారు. వ్య‌వ‌సాయం, ప‌శు పోష‌ణ‌, ఫుడ్ ప్రాసెసింగ్ ల‌ను ఆధునీక‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు మోదీ.

ఢిల్లీలో జ‌రిగిన నీతి ఆయోగ్ లో ప్ర‌ధాని మాట్లాడారు. దిగుమ‌తుల‌ను త‌గ్గించ‌డం, ఎగుమ‌తుల‌ను పెంచ‌డం వంటి వాటిపై దృష్టి పెడుతున్నామ‌న్నారు. వీటిపై కేంద్రంతో పాటు మిగ‌తా రాష్ట్రాలు కూడా దృష్టి పెట్టాల‌ని సూచించారు ప్ర‌ధాన మంత్రి(PM Modi) .

నీతి ఆయోగ్ పాల‌క‌మండ‌లి ఏడో స‌మావేశం ఇది. ఈ స‌మావేశానికి బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్, తెలంగాణ సీఎం కేసీఆర్ బ‌హిష్క‌రించారు.

ఇదిలా ఉండ‌గా సాధ్య‌మైన చోట స్థానిక వ‌స్తువుల‌ను ఉప‌యోగించాల‌ని ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌వంతం చేయాల‌ని కోరారు మోదీ. స్థానికుల‌కు వోక‌ల్ అనేది వ్య‌క్తిగ‌త రాజ‌కీయ పార్టీ ఎజెండా కాద‌న్నారు.

కానీ ఇది అంద‌రి ఉమ్మ‌డి ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు న‌రేంద్ర మోదీ(PM Modi) . ప్ర‌తి పౌరుని జీవ‌న సౌల‌భ్యం, పార‌ద‌ద‌ర్శ‌క‌మైన సేవ‌ల‌ను అందించ‌డం, జీవ‌న నాణ్య‌త‌ను మెరుగు ప‌రిచేందుకు సాంకేతిక‌త‌ను ఉప‌యోగించ‌డం అత్యంత అవ‌స‌ర‌మ‌న్నారు.

వేగ‌వంత‌మైన ప‌ట్ట‌ణీక‌ర‌ణ బ‌లహీన‌త‌కు బ‌దులు భార‌త దేశానికి సంబంధించిన బ‌ల‌మ‌ని మోదీ అన్నారు. కోవిడ్ విష‌యంలో ప్ర‌తి రాష్ట్రం కీల‌క పాత్ర పోషించింద‌న్నారు ప్ర‌ధాని.

Also Read : గూగుల్ తో సాంస్కృతిక శాఖ ఒప్పందం

Leave A Reply

Your Email Id will not be published!