Maharashtra Cabinet : మరాఠా కేబినెట్ కు ముహూర్తం
దేవేంద్ర ఫడ్నవీస్ కు హోం
Maharashtra Cabinet : మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చేసి మరాఠా పీఠంపై కొలువు తీరిన ఏక్ నాథ్ షిండే, భారతీయ జనతా పార్టీ కూటమి సర్కార్ ఇప్పటి దాకా సీఎం, డిప్యూటీ సీఎంలతోనే నడుస్తోంది.
కేబినెట్ లేకుండా ఉండడం అన్నది రాజ్యాంగ విరుద్దం. దీంతో ఎవరెవరికి కేబినెట్ లో బెర్త్ దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరో వైపు శివసేన పార్టీ వివాదం కోర్టులో నడుస్తోంది.
ఇదే విషయంపై కోర్టు సీఈసీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఈ తరుణంలో తాజాగా ఈ వారంలోనే మంత్రివర్గ విస్తరణ(Maharashtra Cabinet) ఉంటుందని అంచనా. ప్రస్తుతానికి డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ కు కీలకమైన హోం శాఖ ఇవ్వ వచ్చని టాక్.
ప్రస్తుతానికి సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం ఎవరికి చోటు కల్పించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. కేబినెట్ విస్తరణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు దేవేంద్ర ఫడ్నవీస్.
మీరు ఊహించని విధంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. జూన్ 30 నుంచి ఇద్దరు సభ్యుల కేబినెట్ తో పని చేస్తోంది.
కాగా దేవేంద్ర ఫడ్నవీస్ కు డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన ప్రధాన శాఖలు కూడా దక్కే చాన్స్ ఉంది. కేబినెట్ కూర్పుపై షిండే, ఫడ్నవీస్ కలిసి అమిత్ షా వద్దకు వెళ్లాల్సిందే.
ఆయన పర్మిషన్ లేకుండా మహారాష్ట్రంలో మంత్రివర్గం ఏర్పాటు అయ్యే అవకాశమే లేదు. పేరుకు మాత్రమే సీఎం, డిప్యూటీ సీఎంలు తప్పా మొత్తంగా అధికారమంతా షా కనుసన్నలలోనే జరుగుతుందన్నది వాస్తవం.
Also Read : మోదీకి రాఖీ పంపిన పాకిస్తాన్ సోదరి