JEE Mains Result 2022 : జేఈఈ మెయిన్ ఫలితాలు వెల్లడి
24 మందికి 100 పర్సంటైల్
JEE Mains Result 2022 : దేశ వ్యాప్తంగా నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు(JEE Mains Result 2022) సోమవారం వెల్లడయ్యాయి. 24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు.
ఈ ఏడాదికి గాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ మెయిన్ ) సెషన్ టూ ఎగ్జామ్ 2022 ఫలితాలు వెల్లడించింది.
ఎన్టీఏ కూడా కట్ ఆఫ్ కేటగిరీలో వారీగా విడుదల చేసింది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కటాఫ్ 88.44 మార్కులు గా నిర్ణయించింది. 100 పర్సంటైల్ మధ్య మారుతూ ఉంటుంది.
జెనరల్ పీడబ్ల్యూడీఇ 0.003 నుండి 88.40 , ఈడబ్ల్యుఎస్ కు 66.11 నుండి 88.40 , ఎస్సీ 43.08 నుండి 88.40 , ఎస్టీ 77 నుండి 88.40 గా నిర్ణయించింది. జేఈఈ మెయిన్స్ లిస్టులో టాప్ లో శ్రేణిక్ మోహన్ శకల నెంబర్ 1గా నిలిచాడు.
తర్వాతి స్థానాలలో నవ్య, సార్థక్ మహేశ్వరి, కృష్ణ శర్మ, పార్థ్ భరద్వాజజ్ , స్నేహ పరీక్, అరుదీప్ కుమార్ ఉన్నారు. వీరితో పాటు మృణాల్ గార్గ్, పెనికలపాటి రవికిషోర్ , పోలిశెట్టి కార్తికేయ, రూపేష్ బియానీ , ధీరజ్ కుంద టాప్ లో ఉన్నారు.
జాస్తి యశ్వంత్ వీవీఎస్ , బుస శివ నాగ వెంకట ఆదిత్య, థామస్ బిజు చీరం వేలిల్, అనికేత్ చటోపాధ్యాయ, బోయ హరేన్ సాత్విక్ , మెండ హిమ వంశీ ఉన్నారు.
ఇక కుశాగ్ర శ్రీవాస్తవ, కొయ్యన సుహాస్ , కనిష్క్ శర్మ, మయాంక్ మోత్వాన, పల్లి జలజాక్షి, సౌమిత్ర గార్గ్ టాప్ లో నిలిచారు. ఇక జేఈఈ మెయిన్ జూలై 25న, 30న మధ్య నిర్వహించారు.
ఇందులో ప్రతిభ కనబర్చిన వారికి దేశంలోని ప్రతిస్టాత్మకమైన ఐఐటీలు, ఇంజనీరింగ్ సంస్థలలో సీట్లు దక్కుతాయి.
Also Read : గూగుల్ తో సాంస్కృతిక శాఖ ఒప్పందం