Justice Lalit : సీజేఐగా జ‌స్టిస్ ల‌లిత్ కు లైన్ క్లియ‌ర్

సంత‌కం చేసిన రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము

Justice Lalit : భార‌త దేశ సర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా కొలువు తీరిన జ‌స్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట ర‌మ‌ణ ప‌ద‌వీ కాలం ఆగ‌స్టు 26తో ముగ‌స్తుంది. ఇప్ప‌టికే సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర స‌ర్కార్ కు జ‌స్టిస్ యుయు ల‌లిత్ ను సిఫార‌సు చేసింది.

ఇదే స‌మ‌యంలో మోదీ నేతృత్వంలోని ప్ర‌భుత్వం జ‌స్టిస్ యు. ల‌లిత్ కు సీజేఐగా అవ‌కాశం ఇవ్వాల‌ని సూచించింది. ఈ మేర‌కు సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ సార‌థ్యంలో ల‌లిత్ కు(Justice Lalit)  లైన్ క్లియ‌ర్ రాగా గురువారం ఇందుకు సంబంధించిన పైల్ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము(Draupadi Murmu) వ‌ద్ద‌కు వెళ్లింది.

ఈ మేర‌కు సీజేఐగా యు. ల‌లిత్ కు సంబంధించిన ఫైల్ పై సంత‌కం చేశారు. దీంతో ఆయ‌న కొలువు తీరేందుకు లైన్ క్లియ‌ర్ వ‌చ్చేసిన‌ట్టే.

ఇక ఆగ‌స్టు 27న సీజీఐగా కొలువు తీర‌నున్నారు జ‌స్టిస్ యుయు. ల‌లిత్. ఈ విష‌యాన్ని న్యాయ శాఖ వెల్ల‌డించింది. ఆరోజు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.

ఆయ‌న పూర్తి పేరు జ‌స్టిస్ ఉద‌య్ ఉమేశ్ ల‌లిత్. ఇప్ప‌టి వ‌ర‌కు 48వ రాష్ట్ర‌ప‌తిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు ఎన్వీ ర‌మ‌ణ‌. ఇక 49వ సీజేఐగా కొలువు తీరుతారు.

త‌న త‌ర్వాత సీజేఐగా బాధ్య‌త‌లు స్వీక‌రించ బోతున్న జ‌స్టిస్ ల‌లిత్ కు(Justice Lalit)  శుభాకాంక్ష‌లు తెలిపారు జ‌స్టిస్ నూత‌ల పాటి వెంక‌ట‌ర‌మ‌ణ‌.

కాగా మూడు నెల‌ల లోపే త‌న ప‌దవీ కాలం ముగియ‌నుంది ల‌లిత్ కు. న‌వంబ‌ర్ 8న రిటైర్ కానున్నారు. ఆయ‌న త‌ర్వాతి స్థానంలో డీవై చంద్ర‌చూడ్ త‌దుప‌రి సీజేఐగా కొలువు తీరుతారు.

Also Read : త్రివ‌ర్ణ ప‌తాకం ఐక్య‌త‌కు చిహ్నం

Leave A Reply

Your Email Id will not be published!