YS Jagan : చ‌దువు కోసం ఎంత ఖ‌ర్చు కైనా సిద్దం

ప్ర‌క‌టించిన ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి

YS Jagan : ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు ఎంత ఖ‌ర్చు అయినా స‌రే విద్య కోసం ఖ‌ర్చు చేసేందుకు రెడీగా ఉన్నామ‌ని చెప్పారు.

చ‌దువు కోవాలంటే ఇబ్బందులు ప‌డే వారికి తాము అండ‌గా ఉంటామ‌న్నారు. ఏ ఒక్క‌రూ విద్యకు దూరం కాకూడ‌ద‌నే త‌న ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.

పేద‌రికం అన్న‌ది జీవితానికే కానీ చ‌దువుకు కాద‌న్నారు. క‌ష్ట‌ప‌డి చ‌దువుకుంటే ఎంత దాకానైనా వెళ్ల వ‌చ్చ‌న్నారు. ఎన్ని క‌ష్టాలు ఎదురైనా స‌రే విద్యాభివృద్ధికి ఎన్ని వంద‌ల కోట్లు అయినా స‌రే తాను మ‌ద్ద‌తు ఇస్తూనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు.

తాజాగా ల‌బ్దిదారుల ఖాతాల్లోకి రూ. 694 కోట్లు విడుద‌ల చేశారు. ఏపీలోని బాప‌ట్ల లో గురువారం జ‌రిగిన స‌భ‌లో సీఎం పాల్గొన్నారు. 2022 ఏడాదికి సంబంధించి ఏప్రీల్ – జూన్ త్రైమాసికానికి సంబంధించి ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ నిధులు ల‌బ్దిదారుల ఖాతాల్లో జ‌మ చేశారు.

ఈ సంద‌ర్భంగా టీడీపీ, ఇత‌ర పార్టీలు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌పై నిప్పులు చెరిగారు. గ‌త పాల‌న‌లో కొంద‌రే ల‌బ్ది పొందారు. కానీ వారు ఏనాడూ విద్యాభివృద్దికి ఫోక‌స్ పెట్ట‌లేద‌ని మండిప‌డ్డారు జ‌గ‌న్ రెడ్డి(YS Jagan).

న‌లుగురు మాత్ర‌మే ల‌బ్ది పొందారు. వారి విద్యా సంస్థ‌లే బాగు ప‌డేలా మాజీ సీఎం చేశారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌గ‌న‌న్న విద్యా దీవెన‌, వ‌స‌తి దీవెన కింద ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 11, 715 కోట్లు నేరుగా అంద‌జేశామ‌ని చెప్పారు సీఎం.

పిల్ల‌ల శిక్ష‌ణ కోసం మైక్రోసాఫ్ట్ తో జ‌త క‌ట్టామ‌ని వెల్ల‌డించారు. మూడేళ్ల కాలంలో రూ. 53 వేల కోట్లు ఖ‌ర్చు చేశామ‌న్నారు.

Also Read : ఎంపీకి క్లీన్ చిట్ వీడియో బ‌క్వాస్

Leave A Reply

Your Email Id will not be published!