Department Of Posts : కోటి జెండాలు అమ్మిన పోస్టల్ శాఖ
రికార్డు స్థాయిలో జాతీయ జెండాల అమ్మకం
Department Of Posts : 75వ ఆజాద్ కీ అమృత్ మహోత్సవ్ లో భాగంగా దేశ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేయాలన్నది కేంద్ర సర్కార్ నిర్ణయం.
ప్రస్తుతం ఇది కూడా వ్యాపారంగా మార్చేశారంటూ కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇక జాతీయ జెండాలను(Department Of Posts) అమ్మకానికి పెట్టింది బారతీయ పోస్టాఫీస్.
దేశ వ్యాప్తంగా కేవలం 10 రోజుల్లో కోటి జెండాలు అమ్మింది. జాతీయ పతాకాల అమ్మకాలలో ఇది ఓ రికార్డ్. ఒక్కో జాతీయ పతాకాన్ని రూ. 25కి విక్రయానికి పెట్టింది పోస్టల్ శాఖ.
ఆన్ లైన్ లో కోటికి పైగా జాతీయ జెండాలను విక్రయించినట్లు(Department Of Posts) కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఎక్కడికైనా సరే జాతీయ జెండాను బుక్ చేసుకుంటే ఉచితంగా డెలివరీ అందజేస్తామని ప్రకటించింది.
1.5 లక్షల పోస్టాఫీసులలో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ దేశంలోని ప్రతి పౌరుడు, ప్రతి కుటుంబం జాతీయ జెండా ప్రాశస్త్యాన్ని తీసుకు వెళ్లేలా ప్రచారం చేసింది.
తక్కువ ఖర్చుతో ఎక్కువ మన్నిక ఉండేలా త్రివర్ణ పతాకాలను అమ్మకానికి పెట్టింది. కేవలం స్వల్ప వ్యవధిలో కోటికి పైగా జెండాలను అమ్మడం విస్తు పోయేలా చేసింది.
ఆన్ లైన్ విక్రయం కోసం పోస్టాఫీస్ దేశమంతటా జెండాలు అందుబాటులో ఉంచింది. ఆన్ లైన్ ద్వారా కానీ లేదా తమ దగ్గరలో ఉన్న పోస్టాఫీసులో పతాకాలను ఉంచింది.
దేశమంతటా 4.2 లక్షల మంది పోస్టల్ ఉద్యోగులు నగరాలు, పట్టణాలు, గ్రామాలు, సరిహద్దు ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలలో హర్ ఘర్ తిరంగా సందేశాన్ని తీసుకు వెళ్లారని పోస్టల్ శాఖ తెలిపింది.
Also Read : అమ్మకానికి ‘హిందూస్థాన్ జింక్’ రెడీ