Kodiyeri Balakrishnan : కేరళ సర్కార్ ను కూల్చే పనిలో గవర్నర్
సీపీఎం రాష్ట్ర చీఫ్ బాలకృష్ణన్ కామెంట్స్
Kodiyeri Balakrishnan : కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పై సంచలన కామెంట్స్ చేశారు ఆ రాష్ట్ర సీపీఎం చీఫ్ కొడియేరి బాలకృష్ణన్. రాష్ట్రంలో కొలువు తీరిన వామపక్ష ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు గవర్నర్ ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఆయన అదే పనిలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కమిటీ కీలక సమావేశం జరిగింది. మీటింగ్ అనంతరం బాలకృష్ణన్ మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్దంగా కొలువు తీరిన ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సమిష్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇందులో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారంటూ ధ్వజమెత్తారు బాలకృష్ణన్(Kodiyeri Balakrishnan).
రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నర్ తన అధికారాలను మించి జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వల్ల ప్రజాస్వామ్య స్పూర్తికి ఆటంకం ఏర్పడుతోందన్నారు.
ఇదిలా ఉండగా భారత దేశంలో ఏకైక వామపక్ష ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడం, దానిని అక్రమ పద్దతుల్లో కూల్చేందుకు నానా తంటాలు పడుతున్నారంటూ ఫైర్ అయ్యారు సీపీఎం చీఫ్. గవర్నర్ తాను రాజునని అనుకుంటున్నారు.
ఇది మంచి పద్దతి కాదు 11 ఆర్డినెన్స్ లపై సంతకం చేసేందుకు ఆరిఫ్ మహ్మద్ ఖాన్ నిరాకరించారు. ఇది ప్రజాస్వామ్య సూత్రాలకు పూర్తిగా విరుద్దమన్నారు బాలకృష్ణన్(Kodiyeri Balakrishnan).
రాజ్ భవన్ , రాష్ట్ర ప్రభుత్వం రెండూ రాజ్యాంగ సంస్థలు. అవి ఒకదానితో ఒకటి కలిసి వెళ్లాలన్నారు. కానీ గవర్నర్ ఒంటెద్దు పోకడ పోతున్నారంటూ సీరియస్ అయ్యారు.
కాగా బాలకృష్ణన్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : సల్మాన్ రష్డీపై దాడి పరిస్థితి విషమం