PM Modi : భార‌త దేశం ప్ర‌జాస్వామ్యానికి మార్గం

యావ‌త్ ప్ర‌పంచానికి దిశా నిర్దేశం

PM Modi : యావ‌త్ ప్ర‌పంచానికి భారత దేశం దిశా నిర్దేశం చేసే స్థాయికి చేరుకుందున్నారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. ఈ దేశ భ‌విష్య‌త్తు యువ‌త‌పై ఆధార‌ప‌డి ఉంద‌న్నారు.

ఎంద‌రో వీరులు, స‌మ‌ర యోధుల బ‌లిదానాల వ‌ల్లే ఈ దేశం ఇవాళ స్వేచ్ఛాయుత దేశంగా విరాజాల్లుతుంద‌న్నారు. 75వ స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌ల సంద‌ర్బంగా సోమ‌వారం దేశ రాజ‌ధాని ఎర్ర‌కోట‌పై జాత‌య జెండాను ఎగుర వేశారు న‌రేంద్ర మోదీ(PM Modi).

ఈ సంద‌ర్బంగా భార‌త జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. దునియా మొత్తం భార‌త్ వైపు చూస్తోంద‌న్నారు. దేశం అన్ని రంగాలలో దూసుకు పోతోంద‌న్నారు మోదీ. భార‌త దేశం ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌తీకగా మారింద‌ని చెప్పారు.

140 కోట్ల ప్ర‌జ‌ల సంక్షేమం కోసం తాము పాటు ప‌డుతున్నామ‌ని చెప్పారు. డెమోక్ర‌సీకి దేశం త‌ల్లి లాంటిద‌న్నారు. టెక్నాల‌జీ ప‌రంగా దేశం ముందంజ‌లో ఉంద‌న్నారు. విద్య‌, వైద్యం , ఉపాధికి ఎక్కువ‌గా ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌న్నారు ప్ర‌ధాన మంత్రి.

ఆజాద్ కీ అమృత్ మ‌హోత్స‌వ్ ను చేప‌ట్టామ‌న్నారు. జాతీయ జెండా ప్రాధాన్య‌త ఏమిటో తెలిసేందుకు హ‌ర్ ఘ‌ర్ తిరంగా కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టామ‌ని చెప్పారు న‌రేంద్ర మోదీ.

యావ‌త్ దేశం ఒకే స్వ‌రంగా ముందుకు సాగాల‌న్నారు. త‌న‌కు ఈ దేశం ఏదో ఒక రోజు ప్ర‌పంచంలో టాప్ లో నిలుస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంద‌న్నారు.

దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన జాతిపిత గాంధీ, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ , బాబా సాహెబ్ అంబేద్క‌ర్ , వీర సావ‌ర్క‌ర్ ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Also Read : సైనికుల‌కు వంద‌నం వీరుల‌కు సలాం

Leave A Reply

Your Email Id will not be published!