Kodiyeri Balakrishnan : స‌ర్కార్ ను కూల్చ‌డంలో గ‌వ‌ర్న‌ర్ బిజీ

సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి బాల‌కృష్ణ‌న్

Kodiyeri Balakrishnan : కేర‌ళ రాష్ట్ర సీపీఎం కార్య‌ద‌ర్శి కొడియేరి బాల‌కృష్ణ‌న్(Kodiyeri Balakrishnan) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి గ‌వ‌ర్న‌ర్ ఆరిఫ్ మ‌హ్మ‌ద్ ఖాన్ ను టార్గెట్ చేశారు.

త‌మ ప్ర‌భుత్వాన్ని కూల్చే ప‌నిలో బిజీగా ఉన్నారంటూ ఆరోపించారు. పార్టీ అధికారిక పత్రిక దేశభ్ మ‌ణి లో రాసిన క‌థ‌నంలో దీనిని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

బంధుప్రీతి ఆరోప‌ణ‌పై క‌న్నూరు యూనివ‌ర్శిటీలో అసోసియేట్ ప్రొఫెస‌ర్ గా సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ ప్రైవేట్ సెక్ర‌ట‌రీ కెకె రాగేష్ భార్య ప్రియా న‌ర్గీస్ నియాకంపై గ‌వ‌ర్న‌ర్ స్టే విధించారు.

దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది పార్టీ. ఆరిఫ్ మ‌హ్మ‌ద్ ఖాన్ గ‌వ‌ర్న‌ర్ గా ప‌ని చేయడం లేద‌ని కేంద్రం చేతిలో కీలు బొమ్మ‌గా మారార‌ని ఆరోపించింది పార్టీ.

అంతే కాదు ఆయ‌న బీజీపీ నాయ‌కుడి లాగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇప్ప‌టికే కేంద్రం త‌న కూల్చే మోడ‌ల్ ను బీజేపీయేత‌ర రాష్ట్రాల‌లో ప్ర‌యోగిస్తూ వ‌చ్చింది.

ఇటీవ‌లే షిండేను అడ్డం పెట్టుకుని మ‌హారాష్ట్ర‌లో మహా వికాస్ అఘాడీ స‌ర్కార్ ను కూల్చేసింది. ఇక ప‌శ్చిమ బెంగాల్ , ఛ‌త్తీస్ గ‌ఢ్ తో పాటు ఇత‌ర రాష్ట్రాల‌పై ఫోక‌స్ పెట్టింది.

ఇదిలా ఉండ‌గా కేర‌ళ గ‌వ‌ర్న‌ర్ కేవ‌లం ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప‌ని చేస్తూ ఉన్నారే త‌ప్పా అస‌లు విష‌యాల గురించి ప‌ట్టించు కోవ‌డం లేదంటూ మండిప‌డ్డారు

పార్టీ కార్య‌ద‌ర్శి కొడియేర్ బాల‌కృష్ణ‌న్(Kodiyeri Balakrishnan). ఇటీవ‌లే ఇలాంటి తీవ్ర ఆరోప‌ణ‌లు చేసి వార్త‌ల్లో నిలిచారు. తాజాగా త‌మ ప‌త్రిక‌లో ఆయ‌న ఇదే అంశాన్ని హైలెట్ చేస్తూ క‌థ‌నం రాయ‌డం మ‌రింత చర్చ‌కు దారి తీసింది.

Also Read : అజ‌య్ మిశ్రాను తొల‌గించే దాకా పోరాటం

Leave A Reply

Your Email Id will not be published!