Revanth Reddy : కేసీఆర్ మునుగోడుకు చేసిందేమీ లేదు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
Revanth Reddy : సీఎం కేసీఆర్ కొత్త నాటకానికి తెర లేపారు. పైకి బీజేపీని టార్గెట్ చేస్తున్నా లోపట మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏం చేశారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రోజు వరకు డిండి ప్రాజెక్టుకు మోక్షం కలగలేదన్నారు. ఆత్మ గౌరవానికి మోసానికి మధ్య జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో విలువైన ఓటును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఏం ఉద్దరించారని మునుగోడులో సభ ఎందుకు పెట్టిండో అర్థం కాలేదన్నారు. గత కొన్నేళ్లుగా అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదంటే కమ్యూనిస్టులు గెలుస్తూ వచ్చారని చెప్పారు.
ఆదివారం రేవంత్ రెడ్డి(Revanth Reddy) మీడియాతో మాట్లాడారు. బయటకు పోయినొళ్లంతా ఏవేవో మాట్లాడుతుంటారని వాటిని తాను పట్టించు కోనన్నారు. తాను కోమటిరెడ్డి కలిసే ప్రచారం చేస్తామన్నారు.
ఆయన స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారని చెప్పారు. పార్టీలో భిన్నమైన వ్యక్తులు ఉంటారని అంత మాత్రాన బలహీన పడినట్లు కాదన్నారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్దే తప్ప టీఆర్ఎస్ పాలనలో ఒనగూరింది ఏమీ లేదన్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy).
మునుగోడులో రైతులకు ఇంకా సాగు నీరంద లేదన్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ఇప్పటి వరకు పూర్తి చేయలేక పోయిందన్నారు. తాను కోట్ల రూపాయలు కేసీఆర్ కు ఇచ్చానని రాజ గోపాల్ రెడ్డి చెబుతున్నారు.
ఎప్పుడు ఎన్ని కోట్లు కేసీఆర్ కు ఇచ్చావో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్టు సోదరులు కేసీఆర్ వలలో పడ వద్దని రేవంత్ రెడ్డి హితవు పలికారు.
Also Read : మునుగోడు సభకు ట్రబుల్ షూటర్