Shiv Sena Symbol : శివసేన పార్టీ గుర్తుపై 25 వరకు గడువు
గురువారం దాకా ఎలాంటి ఉత్తర్వులు లేవు
Shiv Sena Symbol : ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, ఇతర సాంకేతిక సమస్యలపై మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే, ప్రస్తుత సీఎం ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో శివసేన వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
మంగళవారం రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. మరాఠా సీఎం ఏక్ నాథ్ షిండే , శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే మధ్య పార్టీ ఎవరిదనే దానిపై పోరుపై విచారణ చేపట్టిన బెంచ్ నిర్ణయం తీసుకునేందుకు ఎనిమిది ప్రశ్నలను రూపొందించింది.
ఠాక్రే, షిండే శిబిరాల మధ్య పార్టీ గుర్తు వివాదంపై(Shiv Sena Symbol) గురువారం వరకు చర్య తీసుకోవద్దంటూ సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఐదుగురు సభ్యులు కలిగిన రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్ ను గురువారం విచారించనుంది.
మొదట ఎన్నికల కమిషన్ కు సంబంధించిన గుర్తును బెంచ్ నిర్ణయిస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ , న్యాయమూర్తులు కృష్ణ మురారి, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ఉద్దవ్ ఠాక్రే బృందం చేసిన అన్ని అభ్యర్థలను కొట్టి వేయాలని, అసలు శివసేన ఎవరి వర్గమో ఎన్నికల కమిషన్ నిర్ణయించాలని ఏక్ నాథ్ షిండే కోర్టును ఆశ్రయించారు.
మెజారిటీ ప్రజాస్వామ్య బద్దంగా తీసుకున్న అంతర్గత పార్టీ నిర్ణయాలలో కోర్టులు జోక్యం ఎలా చేసుకుంటాయంటూ పేర్కొన్నారు. శివసేనకు చెందిన 55 మంది ఎమ్మెల్యేలలో 39 మంది తిరుగుబాటు చేశారు.
దీంతో తమదే అసలైన పార్టీ అంటూ స్పష్టం చేశారు. తమ తండ్రి ఏర్పాటు చేసిన పార్టీ వేరొకరిది కానే కాదంటూ కోర్టుకు ఎక్కారు ఠాక్రే.
Also Read : కాంగ్రెస్ చీఫ్ ఎన్నికపై గెహ్లాట్ కామెంట్స్