Nitin Gadkari : నితిన్ గడ్కరీ షాకింగ్ కామెంట్స్
సకాలంలో స్పందించడం లేదు
Nitin Gadkari : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీర్ఘకాలంగా సాదా సీదాగా మాట్లాడే కేంద్ర మంత్రి ఇటీవల పార్టీ పరంగా పార్లమెంటరీ బోర్డు నుంచి స్థానం కోల్పోయారు.
ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం లేదంటూ బాంబు పేల్చారు. కాగా నితిన్ గడ్కరీ(Nitin Gadkari) మాటలు నిర్దిష్ట ప్రభుత్వాల కోసం కాదని , సాధారణ ప్రభుత్వాల కోసమేనని బీజేపీ శ్రేణులు పేర్కొంటున్నాయి.
ప్రస్తుతం నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మీరు అద్భుతాలు చేయగలరు. మరియు సంభావ్యత ఉంది. భారత మౌలిక సదుపాయాల భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉండాలనేది తన కోరిక అని చెప్పారు.
మనం ప్రపంచంలో , దేశంలో మంచి సాంకేతికత, మంచి ఆవిష్కరణలు, మంచి పరిశోధన , విజయవంతమైన అభ్యాసాలను అంగీకరించాలన్నారు.
నాణ్యతలో రాజీ పడకుండా ఖర్చులను తగ్గించుకునే ప్రత్యామ్నాయ సామాగ్రిని మనం కలిగి ఉండాలన్నారు. నిర్మాణంలో సమయం చాలా ముఖ్యమైందన్నారు నితిన్ గడ్కరీ.
సమయమే అతిపెద్ద మూలధనం. ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకోక పోవడమే అతి పెద్ద సమస్య అని కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబై లోని అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ నిర్వహించిన నాట్ కాన్ -2022 లో ప్రసంగించారు నితిన్ గడ్కరీ.
సాంకేతికత లేదా వనరుల కంటే సమయం చాలా ముఖ్యమైందన్నారు. అమృత్ కాల్ లేదా స్వర్ణ యుగం అని పిలిచే దానిలో పెద్ద మైలు రాళ్లను దాటడంలో ప్రభుత్వం సాధించిన విజయాన్ని ఎత్తి చూపారు.
ఇదిలా ఉండగా గడ్కరీ మాటలకు, ప్రధాని వ్యాఖ్యలకు మధ్య పొంతన లేదు.
Also Read : 10 రోజుల్లో సిసోడియా అరెస్ట్ – కేజ్రీవాల్