Congress Channel : కాంగ్రెస్ యూట్యూబ్ ఛానల్ తొలగింపు
గూగుల్..యూట్యూబ్ సంస్థలకు ఫిర్యాదు
Congress Channel : దేశంలో ప్రతి రాజకీయ పార్టీకంటూ స్వంత యూట్యూబ్ ఛానల్ తో పాటు ప్రచురణ, ప్రసార మాధ్యమాలు కూడా ఉన్నాయి. 134 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కాంగ్రెస్ పార్టీకి గతంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక ఉండేది.
కానీ ఎలక్ట్రానిక్ మీడయా అన్నది లేకుండా పోయింది. ప్రస్తుతం పార్టీకి సంబంధించి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్ సీ) పేరుతో ఓ స్వంత యూట్యూబ్ ఛానల్ ఉంది.
ఆ పార్టీకి సంబంధించిన రోజూ వారీ కార్యక్రమాలు, పార్టీ నేతల ప్రసంగాలు, ఇంటర్వ్యూలు కూడా ఇందులో ఎప్పటికప్పుడు అప్ లోడ్ చేస్తూ వస్తున్నారు.
ఇదిలా ఉండగా ఉన్నట్టుండి గూగుల్ మాతృ సంస్థ అయిన యూట్యూబ్ ప్లాట్ ఫారమ్ నుంచి ఐఎన్సీ యూట్యూబ్ ఛానల్(Congress Channel) ను తొలగించింది.
ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా తన ట్విట్టర్ ఖాతాలో స్పష్టం చేసింది. ఆన్ లైన్ మాధ్యమం నుంచి తొలగించినట్లు మేం గుర్తించాం.
దీనికి సంబంధించి ఎందుకు తొలగించారనే దానికి గల కారణం ఏమిటనేది ఇంత వరకు యూట్యూబ్ సంస్థ మాకు తెలియ చేయలేదు. ఈ ఘటన బాధాకరం.
ఈ మేరకు యూట్యూబ్ సంస్థ ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియ చేశాం. ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
ఎవరైనా కావాలనే చేశారా లేక ఏదైనా సాంకేతిక పరమైన ఇబ్బందుల కారణంగా తొలగించారా అనే దానిపై ఇంకా తేలాల్సి ఉందిని పేర్కొంది. ఇప్పటికే గూగుల్, యూట్యూబ్ లకు ఫిర్యాదు చేశామన్నారు పార్టీ మీడియా ఇన్ చార్జ్ జైరామ్ రమేష్.
Also Read : ఆరోగ్యానికి..ఆధ్యాత్మికతకు దేశం ఆలవాలం