AAP BJP : ఆప్ ఎమ్మెల్యేల కోసం బీజేపీ వేట
బెదిరస్తున్నారంటూ ఆప్ ఆరోపణ
AAP BJP : ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ యత్నిస్తోందంటూ ఆరోపించారు.
పార్టీలో చేరితే రూ. 20 కోట్లు చేర్పిస్తే రూ. 25 కోట్లు ఆఫర్ ఇస్తూ ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. మరో వైపు తనకు కూడా బీజేపీ ఆఫర్ ఇచ్చిందని అరవింద్ కేజ్రీవాల్ ను కూలదోస్తే తనపై నమోదు చేసిన కేసులను మాఫీ చేస్తామని చెప్పారంటూ బాంబు పేల్చారు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా.
ఇదిలా ఉండగా బుధవారం ఆప్ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆప్ నాయకులు(AAP BJP), కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్ని కోట్ల ఆఫర్లు ఇచ్చినా , ప్రలోభాలకు గురి చేసినా తల వంచరంటూ ప్రకటించారు.
ఇదిలా ఉండగా గురువారం కీలకమైన సమావేశానికి పిలుపునిచ్చారు ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. తాజాగా ఆప్ సీనియర్ నాయకుడు దిలీప్ పాండే మీడియాతో మాట్లాడారు.
తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను చీల్చేందుకు ప్రయత్నిస్తోందంటూ బీజేపీపై మండిపడ్డారు. 40 మంది ఎమ్మెల్యేలను విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొంత మంది ఎమ్మెల్యేలు ఇంకా చేరుకోలేదని ఆరోపించారు. అందరూ రావాలని ఫోన్ చేశాం. సందేశం పంపించామన్నారు దిలీప్ పాండే.
ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 మంది సభ్యులున్నారు. వీరిలో 62 మంది ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొలువు తీరారు. వీరిలో కొంత మంది రాక పోవడంతో ఆప్ ఆందోళన చెందుతోంది. దీనికి కారణం బీజేపీ అని ఆరోపిస్తోంది.
Also Read : ఆప్ సైనికులు అమ్ముడు పోరు – సిసోడియా