MLA Raja Singh : తగ్గేదే లేదంటున్న రాజా సింగ్
ఎమ్మెల్యే మరో వీడియో విడుదల
MLA Raja Singh : మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ను గురువారం రెండోసారి అరెస్ట్ చేశారు. అంతకు ముందు అరెస్ట్ చేసిన ఆయనను కోర్టు ముందు హాజరు పరిచారు.
కస్టడీకి ఇవ్వాలని కోరిన పోలీసుల విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది. తనను నగర బహిష్కరణ చేయాలని చూస్తున్నారంటూ టి. రాజా సింగ్(MLA Raja Singh) సంచలన ఆరోపణలు చేశారు.
ఎమ్మెల్యే రెండోసారి వీడియోను విడుదల చేశారు. తాను తూటాలకు, తుపాకులకు, లాఠీలకు భయపడే వ్యక్తిని కానంటూ ప్రకటన చేశారు. ఉరి శిక్ష వేసినా దేశం కోసం, హిందూ ధర్మం కోసం తాను సిద్దంగా ఉన్నానని వెల్లడించారు.
ఇదిలా ఉండగా తమ మనోభావాలు దెబ్బతినేలా మహ్మద్ ప్రవక్తను దూషించారంటూ, లేనిపోని వ్యాఖ్యలు చేశారంటూ టి. రాజా సింగ్ పై నిప్పులు చెరిగారు ఎంఐఎం ఆధ్వర్యంలో ముస్లింలు. పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేపట్టారు.
దీంతో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. రాత్రి 7 గంటల వరకే షాపులు మూసి ఉంచాలని ఆదేశించారు. మరో వైపు లా అండ్ ఆర్డర్ పై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష చేపట్టారు.
ఇదిలా ఉండగా టి. రాజా సింగ్(MLA Raja Singh) గురువారం మరోసారి విడుదల చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రవక్త గురంచి మాట్లాడానని అంటున్నారు.
కానీ ఎక్కడా ప్రవక్త పేరు ప్రస్తావించ లేదన్నారు. అసదుద్దీన్ ఓవైసీ మత కల్లోలాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు.
ఎంఐఎం, టీఆర్ఎస్ ఆడుతున్న నాటకం అంటూ నిప్పులు చెరిగారు రాజా సింగ్.
Also Read : అదానీ ప్రయత్నానికి ఎన్డీటీవీ అవరోధం