NV Ramana : జర్నలిస్టులకు సీజేఐ ఖుష్ కబర్
ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ ఆదేశం
NV Ramana : ప్రభుత్వాలు మారినా జర్నలిస్టుల బతుకులు మారడం లేదు. ప్రధానంగా తెలంగాణ ఏర్పాటు అయ్యాక పరిస్థితులు కొంత మెరుగు పడుతాయని భావించారు.
కానీ సీన్ మార లేదు. సితార మార లేదు. సరికదా ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు తెలంగాణకు చెందిన జర్నలిస్టులు.
ప్రస్తుతం ప్రభుత్వం తెలంగాణ అయినా మొత్తం దోపిడీ దొంగలంతా ఆ ప్రాంతానికి చెందిన వారే ఉన్నారంటూ జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ కు చెందిన జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్నారు.
జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులకు సంబంధించిన ఇళ్ల స్థలాల కేసులో విచారణ జరిగింది గురువారం సుప్రీంకోర్టులో. స్వతహాగా జర్నలిస్టుల బాధలు ఏమిటో అనుభవించిన వారు కావడంతో భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతల పాటి వెంకట రమణ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆయన ప్రారంభంలో జర్నలిస్ట్ గా పని చేశారు. ఆ తర్వాత లాయర్ గా, న్యాయవాదిగా, హైకోర్టు జడ్జీగా, సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగారు.
ఇక ఇళ్ల స్థలాల విషయంపై జరిగిన విచారణ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టుల వ్యవహారాన్ని బ్యూరోక్రాట్లు, ప్రజా ప్రతినిధులతో ముడి పెట్ట కూడదని జస్టిస్ ఎన్వీ రమణ(NV Ramana) స్పష్టం చేశారు.
జర్నలిస్టులకు 12 ఏళ్ల కిందట ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. రూ. 8 వేల నుంచి రూ. 50 వేల వరకు జీతం తీసుకునే 8 వేల మంది జర్నలిస్టుల అభ్యర్థనను తాను పరిగణలోకి తీసుకుంటున్నానని చెప్పారు.
జర్నలిస్టులు తమకు కేటాయించిన స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు పర్మిషన్ ఇస్తున్నామని తీర్పు స్పష్టం చేశారు.
Also Read : మోదీ పంజాబ్ టూర్ లో లోపాలు నిజమే