AP Top Crop Management : క్రాప్ మేనేజ్‌మెంట్‌లో ఏపీ రికార్డ్

దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ స్థానం

AP Top Crop Management : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అరుదైన ఘ‌న‌త సాధించింది. సీఎంగా కొలువు తీరిన సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ త‌న‌దైన ముద్ర క‌న‌బ‌రుస్తున్నారు.

ఆయ‌న ప్ర‌త్యేకంగా వ్య‌వ‌సాయ రంగానికి ఇతోధికంగా సాయం చేస్తున్నారు. అంతే కాకుండా విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయంపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఆర్బీకే సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేశారు.

స‌బ్సిడీపై రైతుల‌కు పెట్టుబ‌డి సాయం చేస్తున్నారు. బ్యాంకుల‌తో అనుసంధానం చేస్తూ వారి కాళ్ల మీద వారు నిల‌బ‌డేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. తాజాగా సీఎం తోడ్పాటుతో ఏపీ వ్య‌వ‌సాయ రంగంలో ముందంజ‌లో కొన‌సాగుతోంది.

పంట‌ల సాగు, మెళ‌కువ‌లు, ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేయాల‌నే దానిపై గుర్తించ‌డంలో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రం(AP Top Crop Management) దేశంలోనే మొద‌టి స్థానంలో నిలిచింది.

ఈ విష‌యాన్ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ క‌మిష‌న‌ర్ చేవూరు హ‌రికిర‌ణ్ వెల్ల‌డించారు. కేంద్రం ఇటీవ‌ల ప్ర‌వేశ పెట్టిన రియ‌ల్ టైం క్రాప్ మేనేజ్ మెంట్ ద్వారా స‌ర్వే నంబ‌ర్ల ద్వారా ఏయే పంట‌లు వేశార‌న్న దానికి సంబంధించి పూర్తి వివ‌రాలు ఇందులో పొందుప‌ర్చారు.

ఇలా గుర్తించి న‌మోదు చేయ‌డంలో ఏపీ అన్ని రాష్ట్రాల కంటే ముందంజ‌లో నిలిచింద‌ని తెలిపారు క‌మిష‌న‌ర్. గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా రాష్ట్ర ప్ర‌భుత్వం విజ‌య‌వంతంగా అమ‌లు చేస్తున్న ఈ క్రాప్ వ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంద‌ని పేర్కొన్నారు.

ఏపీ సీఎం ఆలోచ‌న నుంచి పుట్టిందే ఈ క్రాప్ విధాన‌మ‌న్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రం మొద‌టి స్థానంలో నిలిచేలా చేసినందుకు రాష్ట్రంలోని వ్య‌వసాయ అధికారుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Also Read : న్యాప్ కిన్స్’ కోసం జ‌డ్జికి విన్న‌పం

Leave A Reply

Your Email Id will not be published!