Punjab CM : వేత‌న సంఘం సిఫార‌సుల‌కు సీఎం ఓకే

పే ప్యానెల్ సిఫార‌సుల‌కు ప‌చ్చ జెండా

Punjab CM :  యూనివ‌ర్శిటీ, కాలేజీ టీచ‌ర్ల‌కు పే ప్యానెల్ సిఫార్సుల‌ను అమ‌లు చేసేందుకు పంజాబ్ ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని కాలేజీలు, యూనివ‌ర్శిటీల్లో వేత‌న సంఘం సిఫార్సుల‌ను త‌మ స‌ర్కార్ అమ‌లు చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం భ‌గ‌వంత్ మాన్(Punjab CM).

ఈ నిర్ణ‌యం వ‌ల్ల రాష్ట్రంలో యూనివ‌ర్శిటీలు, ప్ర‌భుత్వ కాలేజీలు, ప్ర‌భుత్వ – ఎయిడెడ్ ప్రైవేట్ కాలేజీల్లో స‌మాన‌మైన కేడ‌ర్ లో ప‌ని చేస్తున్న టీచ‌ర్లు, అధ్యాప‌కులు, ఇత‌ర ఉద్యోగులంద‌రికీ ప్ర‌యోజ‌నం చేకూరనుంది.

ఇదిలా ఉండ‌గా ఏడ‌వ వేత‌నం సంఘం సిఫార‌సుల‌ను అమ‌లు చేసేందుకు పంజాబ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉపాధ్యాయుల దీర్ఘ‌కాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ కు అనుగుణంగా జ‌న‌వ‌రి 15, 2016 నుంచి వారి వేత‌న స్కేళ్ల‌ను స‌వ‌రించేందుకు ఒప్పుకుంది.

ఈ సిఫార‌సులు ఈ ఏడాది అక్టోబ‌ర్ 1 నుంచి అమ‌లు లోకి రానుంది. క‌ళాశాలల్లో బోధ‌నా అధ్యాప‌కుల కొర‌తను అధిగ‌మించేందుకు ఉద్దేశించిన మ‌రో నిర్ణ‌యంలో యూనివ‌ర్శిటీ గ్రాంట్స్ క‌మిష‌న్ (యూజీసీ) ప్ర‌కారం అర్హ‌త క‌లిగిన కాలేజీలు, యూనివ‌ర్శిటీ రిటైర్డ్ అధ్యాప‌కుల నుండి విజిటింగ్ రిసోర్స్ ప‌ర్స‌న్ ల‌ను ప్ర‌భుత్వ కాలేజీల‌కు నియ‌మించేందుకు మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.

70 ఏళ్ల వ‌య‌స్సు వ‌ర‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన అధ్యాప‌కుల నుండి నియ‌మించ‌బ‌డ‌తారు. నెల‌కు గ‌రిష్టంగా రూ. 30,000కి లోబడి ప్ర‌తి సెష‌న్ కు గౌర‌వ వేత‌నం చెల్లిస్తారు.

ఖాళీగా ఉన్న పోస్టుల‌కు రెగ్యుల‌ర్ రిక్రూట్ మెంట్ ప్ర‌క్రియ పూర్త‌య్యే వ‌ర‌కు ఈ ఏర్పాటు చేస్తారు. అంతే కాకుండా అతిథి అధ్యాప‌కుల వేత‌నాల‌ను క్వాలిఫైడ్ , అన‌ర్హ‌త టీచ‌ర్ల‌కు నెల‌కు క‌నీసం రూ. 33,600 కి పెంచేందుకు మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.

Also Read : హ‌ర్యానా ప్యాన‌ల్ చీఫ్ భాటియా ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!