TTD : తిరుమ‌ల‌కు పోటెత్తిన భ‌క్తులు

దర్శ‌నానికి 20 గంట‌ల స‌మ‌యం

TTD : శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పోటెత్తారు. బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం కానున్నాయి. ఇప్ప‌టికే ఏర్పాట్ల‌లో మునిగి పోయింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ). రోజు రోజుకు భ‌క్తుల తాకిడి మ‌రింత పెరుగుతోంది.

తండోప తండాలుగా త‌ర‌లి వ‌స్తున్న భ‌క్త జ‌నాన్ని అదుపు చేసేందుకు నానా తంటాలు ప‌డుతోంది టీటీడీ(TTD). గ‌త కొంత కాలంగా క‌రోనా కార‌ణంగా ద‌ర్శ‌నం నిలిపి వేసిన టీటీడీ నిషేధాన్ని ఎత్తి వేయ‌డంతో భ‌క్త జ‌నం బారులు తీరారు స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు.

ఇదిలా ఉండ‌గా క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా నిలుపుద‌ల చేసిన స్వామి వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను తిరిగి నిర్వ‌హించేందుకు శ్రీ‌కారం చుట్టింది టీటీడీ.

ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు ఆల‌య కార్య‌నిర్వ‌హ‌ణ అధికారి ధ‌ర్మా రెడ్డి. ఇందులో భాగంగా ప్రివిలైజ్జ్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

బ్ర‌హ్మోత్సవాల‌ను పుర‌స్క‌రించుకుని వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు చెప్పారు.

ఇదిలా ఉండ‌గా ఆదివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో భ‌క్తులు స్వామి, అమ్మ వార్ల‌ను ద‌ర్శించు కోవ‌డం విశేషం. 86, 793 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు.

30 వేల మందికి పైగా త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకున్నారు. రూ. 4.47 కోట్ల హుండీ ఆదాయం స‌మ‌కూరిన‌ట్లు టీటీడీ వెల్ల‌డించింది. రెండో శ‌నివారం రావ‌డం, ఆదివారం కావ‌డంతో భ‌క్తులు తిరుమ‌ల‌కు పోటెత్తారు.

ఎక్క‌డ చూసినా భ‌క్త జ‌న సందోహంతో నిండి పోయింది. క‌నీసం స్వామి వారి ద‌ర్శ‌నం చేసుకోవాలంటే క‌నీసం 20 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా.

Also Read : మ‌హిళా అభ్య‌ర్థుల‌కు మంచి ఛాన్స్

Leave A Reply

Your Email Id will not be published!