Shibu Soren : శిబూ సోరేన్ కు ఢిల్లీ హైకోర్టు ఊరట
లోక్ పాల్ విచారణపై స్టే విధింపు
Shibu Soren : జేఎంఎం చీఫ్, మాజీ జార్ఖండ్ సీఎం శిబూ సోరేన్(Shibu Soren) కు ఢిల్లీ హైకోర్టు ఊరటనిచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల (డీఏ) కేసుకు సంబంధించి లోక్ పాల్ లో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) రాజ్యసభ ఎంపీ శిబూ సోరేన్ పై విచారణపై ఢిల్లీ హైకోర్టు సోమవారం స్టే విధించింది.
ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణ డిసెంబర్ 14 వరకు విచారణను నిలిపి వేసింది.
ఇదిలా ఉండగా అధికార పరిధి ఆధారంగా సీబీఐ ప్రాథమిక విచారణకు ఆదేశించిన లోకాయుక్త ప్రొసీడింగ్స్ , ఆర్డర్ ను శిబూ సోరేన్ సవాల్ చేశారు.
ఈ కేసులో పిటిషనర్ గా ఉన్న లోక్ పాల్ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు నిషికాంత్ దూబేకి జస్టిస్ యశ్వంత్ వర్మ నోటీసు జారీ చేశారు. దీనిపై విచారణను తదుపరి చేస్తామని కోర్టు పేర్కొంది. వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
ఈ అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. తదుపరి విచారణ తేదీ వరకు విచారణను నిలిపి వేస్తున్నట్లు జస్టిస్ వెల్లడించారు.
అధికార పరిధి ఆధారంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రాథమిక విచారణకు ఆదేశించే లోకాయుక్త ప్రొసీడింగ్స్ , ఆర్డర్ ను జేఎంఎం సుప్రీమో, మాజీ జార్ఖండ్ సీఎం శిబూ సోరేన్(Shibu Soren) సవాల్ చేశారు.
ఆగస్టు 4, 2022 న లోక్ పాల్ అతనిపై విచారణకు ప్రాథమిక కేసు ఉందో లేదో నిర్ధారించేందుకు ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించింది.
ఆరోపించిన సంఘటన జరిగిన ఏడేళ్ల తర్వాత ఫిర్యాదు దాఖలైనందుకు తనపై ఎలాంటి విచారణ జరపరాదని స్పష్టం చేసింది హైకోర్టు.
Also Read : అల్ ఖైదా అనుమానితుల అరెస్ట్