ICC Rankings : ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత్ టాప్
ఆసియా కప్ లో ఓడి పోయినా ర్యాంక్
ICC Rankings : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా జట్లకు సంబంధించిన ర్యాంకులను(ICC Rankings) ప్రకటించింది. ఇదిలా ఉండగా ఊహించని రీతిలో భారత జట్టు ఓటమి పాలైనా ర్యాంకుల జాబితాలో టాప్ లో నిలిచింది.
అభిమానులను విస్తు పోయేలా చేసింది. ఇదిలా ఉండగా యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్ -2022ను అండర్ డాగ్స్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలంక చిచ్చర పిడుగులా సత్తా చాటింది.
ప్రగల్భాలు పలికిన పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది. ఫైనల్ లో ఆ జట్టును తక్కువ స్కోర్ కే ఆలౌట్ చేసింది. ఆసియా కప్ అనంతరం ఐసీసీ ర్యాంకింగ్స్ లో మార్పులు చోటు చేసుకున్నాయి.
ఇప్పటి వరకు శ్రీలంక జట్టు ఆరు సార్లు టైటిల్ ను గెలుచుకుంది. కాగా పాకిస్తాన్ మెగా టోర్నీ లో పాల్గొనక ముందు ఐసీసీ ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో ఉన్న పాకిస్తాన్ అనూహ్యంగా నాలుగో స్థానానికి దిగజారింది.
ఇక ఆసియా కప్ లో చెత్త ప్రదర్శనతో చేతులెత్తేసినా ర్యాంకింగ్స్(ICC Rankings) లో మాత్రం టీమ్ ఇండియా నెంబర్ వన్ గా నిలిచి విస్తు పోయేలా చేసింది. పాయింట్ల ఆధారంగా ఆయా జట్లను టాప్ జాబితాను ప్రకటించింది ఐసీసీ.
తాజాగా విడుదల చేసిన లిస్టులో 268 రేటంగ్ పాయింట్లతో టాప్ లో నిలిచింది. 262 పాయింట్లో ఇంగ్లండ్ రెండో ప్లేస్ లో , 258 రేటింగ్ పాయింట్లతో దక్షిణాఫ్రికా మూడో స్థానంలో నిలిచింది.
ఇక 258 పాయింట్లతో పాకిస్తాన్ నాలుగో స్థానంలో , 252 పాయింట్లతో న్యూజిలాండ్ ఐదో ప్లేస్ తో సరి పెట్టుకుంది. ఇక వచ్చే అక్టోబర్ నెలలో టి20 వరల్డ్ కప్ జరగనుంది. అంత లోపుం పలు సీరీస్ లు ఆడనున్నాయి ఆయా లిస్టులో చోటు దక్కించుకున్న జట్లు.
Also Read : టి20 వరల్డ్ కప్ పాకిస్తాన్ టీం డిక్లేర్