PM Modi : ‘చిరుత‌లు’ రావ‌డం చారిత్రాత్మ‌కం – మోదీ

70 ఏళ్ల అనంత‌రం మ‌ళ్లీ పున‌రావృతం

PM Modi : డెబ్బై సంవ‌త్స‌రాల త‌ర్వాత భార‌త దేశానికి తిరిగి చిరుత‌లు రావ‌డం చారిత్రాత్మ‌క‌మ‌న్నారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోదర దాస్ మోదీ. ఇవాళ ఆయ‌న పుట్టిన రోజు. ఆసియా ఖండంలో ఎక్కువ‌గా చిరుత పులుల‌కు కేంద్రంగా భార‌త దేశం ఉండేది.

రాను రాను 1952 నాటికి చిరుత‌ల జాతి అంత‌రించి పోయిన‌ట్లుగా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో ఇరాన్ లో మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి. శాటిలైట్ ద్వారా ప‌ర్యవేక్షించేందుకు అన్ని చిరుత‌ల‌కు రేడియో కాల‌ర్ ను క‌ట్టారు.

ఇదిలా ఉండ‌గా మ‌ధ్య ప్ర‌దేశ్ లోని కునో నేష‌న‌ల్ పార్కుకు శనివారం ఎనిమిది చిరుత‌లు చేరుకున్నాయి. ఈ సంద‌ర్బంగా వాటిలో మూడు చిరుత‌ల‌ను ఇవాళ విడుద‌ల చేశారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ(PM Modi).

భార‌త దేశంలో చిరుత‌ల‌ను తిరిగి ప్ర‌వేశ పెట్టే కార్య‌క్ర‌మంలో స‌హాయం చేసినందుకు న‌మీబియా ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు ప్ర‌ధాని. 1952లో చిరుతలు అంత‌రించి పోయాయంటూ ప్ర‌క‌టించ‌డం దుర‌దృష్ట‌క‌రం.

కానీ ద‌శాబ్దాలుగా ఎంద‌రో పాల‌కులు వ‌చ్చారు. కానీ వాటిని తిరిగి ప్ర‌వేశ పెట్టేందుకు ఎటువంటి నిర్మాణాత్మ‌క ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మోదీ.

21వ శాత‌బ్ద‌పు భార‌త దేశం యావ‌త్ ప్ర‌పంచానికి సందేశాన్ని ఇస్తోంద‌న‌న్నారు. ఆర్థిక వ్య‌వ‌స్థ , జీవావ‌ర‌ణ శాస్త్రం విరుద్ద‌మైన రంగాలు కాద‌ని చెబుతోంద‌న్నారు ప్ర‌ధాన మంత్రి(PM Modi).

కునో నేష‌న‌ల్ పార్క్ లో విడిచి పెట్టిన చిరుత‌ల‌ను చూసేందుకు పౌరులు ఓపిక ప‌ట్టాల‌ని స్ప‌ష్టం చేశారు. ఇవాళ ఈ చిరుత‌లు ఈ ప్రాంతానికి తెలియ‌కుండా మ‌న అతిథులుగా వ‌చ్చాయ‌ని తెలిపారు.

కొన్ని నెల‌ల స‌మ‌యం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. త‌న 72వ పుట్టిన రోజు సంద‌ర్భంగా చిరుత‌ల‌ను విడుద‌ల చేయ‌డం విశేషం.

Also Read : మోదీ జీవితం నిబ‌ద్ద‌త‌కు నిద‌ర్శ‌నం

Leave A Reply

Your Email Id will not be published!