Admiral R Hari Kumar : చైనా సవాల్ పాకిస్తాన్ బలాదూర్
నేవీ చీఫ్ అడ్మిరల్ కామెంట్స్
Admiral R Hari Kumar : భారత నేవీ చీఫ్ ఆర్. హరి కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన చైనా, పాకిస్తాన్ దేశాలు అనుసరిస్తున్న విధానాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా బలీయమైన సవాల్ గా మిగిలి పోయిందని అన్నారు. అంతే కాకుండా పక్కనే ఉన్న దాయాది పాకిస్తాన్ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తన సైనిక ఆధునికీకరణను కొనసాగిస్తూ వస్తోందని స్పష్టం చేశారు.
ప్రధానంగా నావికా దళం 50- ప్లాట్ ఫారమ్ ఫోర్స్ గా మారే మార్గంలో ఉందని హెచ్చరించారు నేవీ చీఫ్. ఈ ప్రాంతంలో ఉగ్రవాదం ఉన్నప్పటికీ ప్రధాన సమస్య భద్రతా ముప్పేనని పేర్కొన్నారు.
సరిహద్దులో చైనా ఇప్పటికీ బలమైన సవాళ్లను విసురుతోందన్నారు. ఉగ్రవాదం అభివృద్ది చెందడం దేశానికి ప్రధానమైన సెక్యూరిటీ ముప్పుగా మారిందని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్(Admiral R Hari Kumar).
భూమి పైనే కాకుండా సముద్ర సరిహద్దుల్లో కూడా తన ఉనికిని పెంచు కుంటూనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ మహా సముద్ర ప్రాంతంలో తన నౌకాదళ ఉనికిని సాధరణీకరించేందుకు యాంటీ పైరసీ కార్యకలాపాలను ఉపయోగించు కోవడం ద్వారా చైనా అత్యంత బలంగా ఉందన్నారు.
మన భూ సరిహద్దుల్లోనే కాకుండా సముద్ర డొమైన్ లో కూడా తన ఉనికిని పెంచుకుందని నేవీ చీఫ్ చెప్పారు. సంభావ్య ప్రత్యర్థులతో యుద్దాన్ని తోసి పుచ్చలేమన్నారు. కానీ సాయుధ చర్యగా మారకుండా ఉండవచ్చని హరికుమార్(Admiral R Hari Kumar) తెలిపారు.
రోజూ వారీ ప్రాతిపదికన పోటీ జరుగుతున్న సమయంలో పరిమితులను పరీక్షించడం జరుగుతుందన్నారు.
Also Read : 25 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్