Ashok Gehlot vs Sachin Pilot : రాజస్థాన్ లో సీఎం వర్సెస్ పైలట్
పార్టీ ప్రెసిడెంట్ రేసులో గెహ్లాట్
Ashok Gehlot vs Sachin Pilot : కాంగ్రెస్ పార్టీలో కొత్త వివాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం వచ్చే అక్టోబర్ 17న పార్టీ చీఫ్ ఎన్నిక జరగనుంది. రాహుల్ గాంధీ తాను పోటీలో ఉండనంటూ ప్రకటించారు.
ఆయన భారత్ జోడో యాత్ర చేపట్టారు. తమిళనాడులో ముగిసి కేరళలో కొనసాగుతోంది. ప్రధానంగా పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ అశోక్ గెహ్లాట్ ను బరిలో ఉండాలని సూచించినట్లు సమాచారం.
మరో వైపు తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ సైతం తాను కూడా పోటీ చేస్తానంటూ ప్రకటించడం కలకలం రేపింది. ఈ తరుణంలో అశోక్ గెహ్లాట్ వర్సెస్ శశి థరూర్ మధ్య పోటీ ఉండనుంది.
ఇదే సమయంలో సీఎంగా రాజస్థాన్ లో ఉండడం కష్టం అవుతుంది. ఢిల్లీలో ఉండాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా నిన్న రాత్రి రాజస్థాన్ లో ఎమ్మెల్యేలతో తాను ఎక్కడికీ వెళ్లడం లేదని స్పష్టం చేశారు సీఎం అశోక్ గెహ్లాట్.
మరో వైపు ఆయన స్థానం ఖాళీ అయితే ఎప్పటి నుంచో సీఎం కావాలని ఆశిస్తున్న సచిన్ పైలట్ రెడీగా(Ashok Gehlot vs Sachin Pilot) ఉన్నారు. ఆయన ఎప్పుడెప్పుడు ఢిల్లీకి వెళతారా అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా 2020లో సచిన్ పైలట్ తిరుగుబాటు కారణంగా 2020లో గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చి వేయబడింది. 71 ఏళ్ల అశోక్ గెహ్లాట్ పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు.
అయితే తాను రాష్ట్రానికి దూరంగా ఉండనని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. రాజస్తాన్ సమస్య మేడం సోనియా గాంధీ చేతిలో ఉంది. ఆమె ఏం చెబితే అదే వేదం.
Also Read : రాజస్థాన్ ఎమ్మెల్యేలకు సీఎం భరోసా