PM Cares Trustees : పీఎం కేర్స్ ట్రస్టీలుగా టాటా..థామస్..సుధా
మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కేటీ థామస్
PM Cares Trustees : ప్రధానమంత్రి కేర్స్ ఫండ ట్రస్టీలలో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త రతన్ టాటా (Ratan TATA) నియమితులయ్యారు. ఆయనతో పాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కేటీ థామస్ కూడా నియమించింది కేంద్ర ప్రభుత్వం.
మాజీ కంప్ట్రోలర్ , ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహ్రిషీ, ఇన్పోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్మన్ సుధా మూర్తి, టీచ్ ఫర్ ఇండియా సహ వ్యవస్థాపకుడు ఆనంద్ షా ఫండ్ సలహా బోర్డులోకి నామినేట్ అయ్యారు.
వీరితో పాటు లోక్ సభ మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండా సహా ప్రముఖులు పీఎం కేర్స్ ఫండ్ కు ట్రస్టీలుగా(PM Cares Trustees) నామినేట్ అయినట్లు మోదీ ప్రభుత్వం వెల్లడించింది.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా , ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు కొత్తగా నియమితులైన హాజరైన ట్రస్టీల బోర్డు సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన వచ్చింది.
ఇదిలా ఉండగా పీఎం కేర్ ఫండ్స్ లో అంతర్భాగంగా మారినందుకు ట్రస్టీలను ప్రధాన మంత్రి స్వాగతించారని ప్రధాన మంత్రి కేంద్ర కార్యాలయం వెల్లడించింది.
ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఇదిలా ఉండగా ఈ పీఎం కేర్స్ ఫండ్ కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా ధర్మకర్తలుగా ఉన్నారు.
కొత్త ట్రస్టీలు, సలహాదారుల భాగస్వామ్యం పీఎం కేర్స్ ఫండ్ పనితీరుకు విస్తృత దృక్కోణాలను అందజేస్తుందని పీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారని పీఎంఓ తెలిపింది.
Also Read : రష్యాను ఒప్పించాలంటే మోదీనే బెటర్