Russia Ukraine War : రష్యా దళాలకు ఉక్రెయిన్ షాక్
రిజర్వ్ సైనికుల ఏర్పాటుకు ఓకే
Russia Ukraine War : ఉక్రెయిన్, రష్యా యుద్దం(Russia Ukraine War) కొనసాగుతూనే ఉన్నది. ముందు నుంచీ ఉక్రెయిన్ తనకు కొరకొరరాని కొయ్యగా మారడంతో రష్యా చీఫ్ వ్లాదిమిర్ పుతిన్ కన్నెర్ర చేశాడు.
ఆపై ఆ దేశం కంటే అధ్యక్షుడు జెలెన్ స్కీ ని మట్టు బెట్టాలని డిసైడ్ అయ్యాడు. ఈ మేరకు యావత్ ప్రపంచం వద్దన్నా వినిపించు కోలేదు. తనలోని అసలు నైజాన్ని బయటకు తీశాడు పుతిన్.
ఎన్ని బాంబులు, ఆయుధాలు, రాకెట్ లాంచర్లు ప్రయోగించినా జెలెన్ స్కీని చంపలేక పోయాడు. ఇదే సమయంలో అంతకంతకూ ఉక్రెయిన్ ప్రజలు, సాయుధ దళాలు ఎక్కడా తల వంచడం లేదు.
తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమయ్యారు. దీంతో జస్ట్ వారం రోజుల్లోనే ఉక్రెయిన్లు లొంగి పోతారని భావించిన పుతిన్ కు కోలుకోలేని షాక్ తగులుతోంది.
ఇదే సమయంలో ఐక్య రాజ్య సమితి జనరల్ సెక్రటరీ గుటెన్ బర్ ఉక్రెయిన్ ను సందర్శించాడు. కన్నీటి పర్యంతం అయ్యాడు. ఎక్కడ చూసినా శిథిలాలు కనిపించడంతో తట్టుకోలేక పోయాడు జనరల్ సెక్రటరీ.
తాను అనుకున్న సమయంలో ఉక్రెయిన్ తల వంచక పోవడంతో పుతిన్ షాక్ కు గురయ్యాడు. రాను రాను సైనిక దళాలు ఇబ్బందులకు గురవుతుండడం, కాలం సహకరించక పోవడంతో ఏం చేయాలనే దానిపై పుతిన్ పునరాలోచనలో పడినట్లు సమాచారం.
కాగా అడుగడుగునా ఎదురు దెబ్బలు తగులుతుండడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రిజర్వ్ సైనిక దళాలను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు.
జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆర్మీలో చేరాలని అనుకునే వాళ్లు రావాలని కోరారు.
Also Read : పసిఫిక్ దీవులపై భారత్..యుఎస్ ఫోకస్