Mohan Bhagwat : ముస్లిం మేధావులతో ఆర్ఎస్ఎస్ చీఫ్ భేటీ
దేశంలో నెలకొన్న సమస్యలపై చర్చలు
Mohan Bhagwat : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్(Mohan Bhagwat) పలువురు ముస్లిం మేధావులతో సమావేశం అయ్యారు. ఇటీవలి వివాదాలు, దేశంలో మత పరమైన చేరికలను బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు.
యూపీలో జ్ఞాన వాపి, కర్ణాటకలో హిజాబ్ వివాదంతో పాటు జనాభా నియంత్రణ వంటి ఇటీవలి సంఘటనలపై చర్చించారు. ఆర్ఎస్ఎస్ కు సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం మత పరమైన చేరికల ఇతివృత్తాన్ని ప్రచారం చేయడం కోసం ఈ కీలక సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సిఈసీ) ఎస్. వై. ఖురేషీ, ఢిల్లీ మాజ లెఫ్టినెంట్ వర్నర్ (ఎల్జీ ) నజీవ్ జంగ్ , అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ (ఏఎంయూ) మాజీ చాన్సలర్ లెఫ్టినెంట్ జనరల్ జమీర్ ఉద్దీన్ షా, మాజీ ఎంపీ షాహిద్ సిద్దిఖీ, వ్యాపారవేత్త సయీద్ వంటి పలువురు మేధావులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ సిద్దిఖీ జాతీయ మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రజల మధ్య శాంతి, సౌభ్రాతృత్వాన్ని బలోపేతం చేసేందుకు చర్చలు జరిగాయని చెప్పారు.
దేశంలో ఏమి జరిగినా మత పరమైన ఐక్యత బలహీన పడుతుందని ఆందోళన చెందుతున్నామని పేర్కొన్నారు. దేశంలో శాంతి , సోదర భావాన్ని ఎలా కొనసాగించాలి , బలోపేతం చేయాలనే దానిపై తామంతా చర్చించామని స్పష్టం చేశారు.
మోహన్ భగవత్ చాలా మంది అనుసరించే సంస్థకు చెందిన వారని ఎంపీ అన్నారు. మోహన్ భగవత్(Mohan Bhagwat) ముందు నుంచీ ఇతర సంస్థల పట్ల ఆదరాభిమానాలు కలిగి ఉన్నారని పేర్కొన్నారు ఎంపీ.
Also Read : పార్లమెంట్ సాక్షిగా వివక్ష నిజం – ప్రియాంక