AAP Slams : గవర్నర్ నిర్ణయం ఆప్ ఆగ్రహం
ప్రజాస్వామ్యానికి తీరని దెబ్బ
AAP Slams : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ పై నిప్పులు చెరిగారు.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్ లో ప్రజాస్వామ్యం అన్నది లేకుండా పోయిందన్నారు.
విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వ డిమాండ్ ను పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ తిరస్కరించారు.
ఈనెల 22న పంజాబ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని పిలవాలన్న ఉత్తర్వును గవర్నర్ ఉపసంహరించుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఆప్, బీజేపీ, కాంగ్రెస్, శిరోమణి అకాళీదళ్ (సాడ్ ) మధ్య మాటల తూటాలు పేలాయి.
గవర్నర్ పురోహిత్ తీసుకున్న నిర్ణయంపై ఘాటుగా స్పందించారు అరవింద్ కేజ్రీవాల్(AAP Slams). లోటస్ ప్లాన్ విఫలం కావడం ప్రారంభించిందన్నారు.
అయితే నంబర్ ఇంకా పూర్తి కాలేదని పేర్కొన్నారు సీఎం. ఇదిలా ఉండగా గవర్నర్ చర్యను విమర్శించారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
గవర్నర్ అసెంబ్లీని నడిపేందుకు అనుమతి ఇవ్వక పోవడం దారుణమన్నారు. దేశ ప్రజాస్వామ్యంపై పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కోట్లాది మంది ప్రజలు లేదా ఒక ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు నడుపుతారని పేర్కొన్నారు. గవర్నర్ చర్య ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆరోపించారు.
Also Read : ముస్లిం మేధావులతో ఆర్ఎస్ఎస్ చీఫ్ భేటీ