Telangana Crop : రికార్డు స్థాయిలో పంటల సాగు
కోటి 35 లక్షల ఎకరాలు
Telangana Crop : తెలంగాణలో పెద్ద ఎత్తున వర్షాలు కురియడంతో ఊహించని రీతిలో సాగు(Telangana Crop) కొనసాగింది. ఇప్పటి వరకు గతంలో కంటే ఏకంగా కోటి 35 లక్షలకు పైగా సాగైంది.
గత ఎనిమిది ఏళ్ల కాలంలో 48 లక్షలు మాత్రమే సాగైంది. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆశించిన దాని కంటే వర్షాల తాకిడి పెరిగింది.
రాష్ట్రంలోని ప్రాజెక్టులు, చెరువులు, కాలువలు, కుంటలు అలుగు పారుతున్నాయి. గతంలో పంజాబ్, హర్యానా రాష్ట్రాలు ధాన్యాగారాలుగా పేరొందాయి.
తాజాగా ఆయా రాష్ట్రాలను అధిగమించి తెలంగాణ నిలిచింది. వానా కాలంలో భారీ ఎత్తున సాగైంది. ఇంకో నెల పాటు పంటలు సాగు చేసేందుకు ఆస్కారం ఉంది.
వరి పంట సాగులో నెంబర్ వన్ గా(Telangana Crop) నిలిచింది. ఈ ఒక్క పంటనే 64.31 లక్షల ఎకరాల్లో సాగు కావడం విశేషం. రికార్డు స్థాయిలో నమోదు కావడం ఒక రకంగా రికార్డ్ అని చెప్పక తప్పదు.
2020-21 సంవత్సరానికి సంబంధించి వానాకాలంలో సాగు విస్తీర్ణం అంతకంతకూ రెట్టింపు అవుతోంది. 2015-16 లో 85.41 లక్షల ఎకరాలు మాత్రమే సాగయ్యాయి.
సాగు పరంగా చూస్తే వరి తర్వాత పత్తి 49.98 లక్షల ఎకరాలలో సాగు కాగా మొక్క జొన్న 6.20 లక్షల ఎకరాలు, కంది సాగు ను 5.61 లక్షల ఎకరాలు, సోయాబీన్ ను 4.33 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి.
గత సంవత్సరం 2021తో పోలిస్తే ఈ ఏడాది 2022లో సాగు విస్తీర్ణం వరి పంటను 2.20 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. రైతులు పెద్ద ఎత్తున సాగు విస్తీర్ణంలో నిమగ్నమయ్యారు.
Also Read : వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు