APSRTC Busses : దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 4,500 బస్సులు
మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు
APSRTC Busses : దసరా పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను భారీ ఎత్తున బస్సులను నడపాలని నిర్ణయించింది.
ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.
సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 9 వరకు మొత్తం రాష్ట్రం నుంచి 4,500 ప్రత్యేక బస్సులను(APSRTC Busses) నడుపుతున్నట్లు తెలిపారు. విజయవాడలో ఎండీ ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడారు.
ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. దసరా పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రయాణికులు ఏపీకి వస్తారని చెప్పారు.
వారందరినీ దృష్టిలో పెట్టుకుని బస్సులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. దసరా సందర్భంగా చెన్నై, హైదరాబాద్, బెంగళూరుతో పాటు 21 నగరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు(APSRTC Busses) నడుపుతున్నట్లు స్పష్టం చేశారు ద్వారకా తిరుమలరావు.
ప్రయాణీకులు తమ టికెట్ల కోసం ఇ- పేమెంట్స్ యాప్ లు గూగుల్ పే, ఫోన్ పే, పే టీఎం, తదితర వాటి ద్వారా కూడా డబ్బులు చెల్లించవచ్చన్నారు.
అంతే కాకుండా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా టికెట్లకు సంబంధించిన డబ్బులను చెల్లించే సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు ఆర్టీసీ ఎండీ.
అంతే కాకుండా సెప్టెంబర్ 27 నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని తిరుపతి – తిరుమల మధ్య ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టాలని యోచిస్తున్నట్లు చెప్పారు ఎండీ.
Also Read : డిసెంబర్ నాటికి ఇళ్ల పంపిణీ – జగన్