Covid19 : పెరుగుతున్న క‌రోనా కేసులతో ప‌రేషాన్

24 గంట‌ల్లో 5,443 కొత్తగా కోవిడ్ కేసులు

Covid19 : రోజు రోజుకు త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా కేసులు(Covid19) ఉన్న‌ట్టుండి మ‌ళ్లీ పెరుగుతుండ‌డంతో కొంత ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా క‌రోనా క‌ట్ట‌డి కోసం కేంద్ర స‌ర్కార్ దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌ట్టింది.

రెండేళ్లుగా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని ప్ర‌త్యేకంగా భార‌త దేశ ప్ర‌జ‌ల‌కు చుక్క‌లు చూపించింది. కోలుకోలేని దెబ్బ కొట్టింది. భారీ ఎత్తున ప్రాణ‌న‌ష్టం సంభ‌వించింది.

తాజాగా కేసులు మ‌ళ్లీ ఊపందుకున్నాయి. రోజు రోజుకు 4 వేల‌కు పైగా కొత్త‌గా క‌రోనా కేసులు(Covid19) న‌మోదు కావ‌డం మ‌రింత ఇబ్బంది క‌లిగిస్తోంది. దీంతో రంగంలోకి దిగింది కేంద్ర కుటుంబ‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ‌.

బూస్ట‌ర్ డోస్ వేసుకోవాల‌ని పిలుపునిచ్చారు భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. ఇక ప్ర‌స్తుతం క‌రోనా కేసుల విష‌యానికి వ‌స్తే 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 5,443 కేసులు న‌మోద‌య్యాయి.

క‌రోనా కార‌ణంగా 26 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. కేర‌ళ‌లో ఎక్కువ‌గా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య క‌రోనా కార‌ణంగా 5,28,429కి చేరుకుంది.

ఈ విష‌యాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం కేసుల ప‌రంగా చూస్తే 46,342 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల సంఖ్య 4,45,53,042కు చేరుకుంది.

ఇక మొత్తం ఇన్ఫెక్ష‌న్ ల‌లో యాక్టివ్ కేసులు 0.10 శాతం ఉండ‌గా జాతీయ కోవిడ్ -19 రిక‌వ‌రీ ర‌రేటు 98.71 శాతానికి పెరిగింద‌ని మంత్రిత్వ శాఖ స్ప‌ష్టం చేసింది. ఒక్క రోజే ఇంత భారీ మొత్తంలో కేసులు న‌మోదు కావ‌డాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించింది కేంద్రం.

Also Read : ద‌స‌రాకు ఏపీఎస్ఆర్టీసీ 4,500 బ‌స్సులు

Leave A Reply

Your Email Id will not be published!