Delhi Heavy Rain : ఢిల్లీలో కుండపోత యూపీలో బడులు మూత
యూపీ, గుర్గావ్ లలో దంచి కొడుతున్న వానలు
Delhi Heavy Rain : భారీ వర్షాలు దేశ రాజధాని ఢిల్లీని ముంచెత్తుతున్నాయి(Delhi Heavy Rain). ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లు జలమయం అయ్యాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇక ఢిల్లీతో పాటు ఉత్తర ప్రదేశ్ లో సైతం వర్షాలు దంచికొడుతున్నాయి. ఇక గుర్గావ్ లో ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. పలు చోట్ల రోడ్లన్నీ నీట మునిగాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఢిల్లీని రెండో రోజు కూడా ఇబ్బందికి గురైంది.
అనేక ప్రాంతాలలో రోడ్లన్నీ వరదలను తలపింప చేశాయి. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎన్సీఆర్లోని కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. సహాయక చర్యలు చేపడుతున్నారు.
అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ ప్రభుత్వం కోరింది. గత వారం రోజుల్లో అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి.
ఇక ఊహించని రీతిలో వర్షాలు కురుస్తుండడంతో ఉత్తర ప్రదేశ్ లోని(Uttar Pradesh) 10 జిల్లాల్లో పాఠశాలలను మూసి వేశారు. గుర్గావ్ లోని ప్రైవేట్,, కార్పొరేట్ కార్యాలయాలలో వర్షాల కారణంగా పని చేస్తున్న ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పని చేయాలని కోరాయి.
ఇక భారీ వర్షాల కారణంగా ఫిరోజాబాద్ లో సాధారణ జన జీవనం స్తంభించింది. పిడుగులు పడడం, గోడ కూలిపోయిన ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
11 మంది తీవ్రంగా గాయపడ్డారు. అలీఘర్ లోని పాఠశాలను బలవంతంగా మూసి వేయాల్సి వచ్చింది. ఇక సౌత్ ఢిల్లీ, ఆగ్నేయ ఢిల్లీ, ఘజియాబాద్ , ఇందిరాపురం, ఛప్రౌలా, నోయిడా, దాద్రీ, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్ , మనేసర్ , తదితర ప్రాంతాలన్నీ వర్షాల తాకిడికి వణుకుతున్నాయి.
Also Read : పెరుగుతున్న కరోనా కేసులతో పరేషాన్