Ashok Gehlot : కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా – గెహ్లాట్
సంచలన ప్రకటన చేసిన రాజస్థాన్ సీఎం
Ashok Gehlot : సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి తదుపరి అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపడతారనే దానిపై ఉత్కంఠకు తెర దించే ప్రయత్నం చేశారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్(Ashok Gehlot).
శుక్రవారం సీఎం మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం పార్టీకి సంబంధించి తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.
గతంలో పార్టీ చీఫ్ గా ఉన్న రాహుల్ గాంధీ తప్పుకోవడంతో ఆయన స్థానంలో మేడం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే తాను బరిలో ఉండడం లేదని ప్రకటించారు మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ.
ఈ తరుణంలో జి23 అసమ్మతి వర్గంలో కీలక నాయకుడిగా ఉన్న తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ సైతం తాను కూడా కాంగ్రెస్ చీఫ్ రేసులో ఉన్నానని ప్రకటించారు.
ఇదే సమయంలో గాంధీ ఫ్యామిలీ వర్సెస్ అసమ్మతి వర్గానికి చెందిన నాయకుల మధ్య పోటీ అనివార్యమైంది. ఇప్పటికే గాంధీకి వీర విధేయులుగా ఉన్న వారిలో మల్లికార్జున్ ఖర్గే, మధ్య ప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్(Kamal Nath) తో పాటు పలువురు నేతలు అధ్యక్ష బరిలో ఉండనున్నారు.
ఇప్పటికే ఏఐసీసీ ఎన్నికల అధికారి మధుసూదన్ మిస్త్రీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 24 నుంచి ప్రారంభమై ఈనెలాఖరుతో ముగుస్తుంది.
ఇదే సమయంలో అక్టోబర్ 17న అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనుంది. 19న రిజల్ట్స్ ప్రకటిస్తారు. మరో వైపు ఒకరు ఒకే పదవి కలిగి ఉండాలని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ తరుణంలో రాజస్థాన్ సీఎంగా ఎవరు ఉంటారనేది ఉత్కంఠ రేపుతోంది.
Also Read : సచిన్ పైలట్ ను సీఎం చేస్తే వ్యతిరేకించం