Rajasthan Crisis : కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై నేతల గుస్సా
ఇంకా కొలిక్కి రాని రాజస్థాన్ సంక్షోభం
Rajasthan Crisis : రాజస్థాన్ లో కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సంక్షోభంలో(Rajasthan Crisis) కూరుకు పోయింది. సీఎం అశోక్ గెహ్లాట్ ఏఐసీసీ చీఫ్ ఎన్నిక బరిలో ఉంటారని ప్రచారం జరిగింది.
ఆయన అభ్యర్థిత్వానికి ఇప్పటికే మేడం సోనియా గాంధీ మద్దతు లభించింది. అక్టోబర్ 17న ఎన్నిక జరగనుంది. ఇక గెహ్లాట్ కు వ్యతిరేకంగా తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ బరిలో ఉండనున్నారు.
ఇది పక్కన పెడితే పార్టీకి సంబంధించి ఒకరికి ఒకే పదవి ఉండాలని ఉదయ్ పూర్ లో జరిగిన చింతన్ బైటక్ లో స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని భారత్ జోడో పాదయాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ ప్రకటించారు కూడా.
ఇదే సమయంలో తాను ఎక్కడికీ వెళ్లడం లేదని అటు ఢిల్లీలో ఇటు రాజస్థాన్ లో ఉంటానని స్పష్టం చేశారు తన పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం అశోక్ గెహ్లాట్. దీనిని తీవ్రంగా తప్పు పట్టారు మరో సీనియర్ నాయకుడు, సీఎం పదవిని ఆశిస్తున్న సచిన్ పైలట్.
ఆయన ఇప్పటికే అశోక్ గెహ్లాట్ పై తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. పార్టీలో చోటు చేసుకున్న సంక్షోభం ముదిరి పాకాన పడడంతో ముందుగా మేల్కొన్నారు సోనియా గాంధీ. ఆమె సీనియర్ నాయకులు అజయ్ మాకెన్, మల్లికార్జున్ ఖర్గేలను నియమించింది.
వారు జైపూరు కు వెళ్లారు. అక్కడ తాము సచిన్ పైలట్ ను సీఎంగా ఒప్పుకోబోమంటూ 90 మంది ఎమ్మెల్యేలు ప్రకటించారు. వారు పరిశీలకులను కలిసేందుకు నిరాకరించారు.
దీంతో అజయ్ మాకెన్, ఖర్గేలు షాక్ కు గురయ్యారు. దీనిపై ఇది పూర్తిగా పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తనకేమీ తెలియదని అదంతా ఎమ్మెల్యేల ఇష్టమని స్పష్టం చేశారు అశోక్ గెహ్లాట్.
Also Read : జోడో యాత్ర సరే రాజస్థాన్ మాటేంటి